నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పరిణామాలపై నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాంటి వారిని దూషించడం చాలా బాధకరమైన విషయమని.. అందులో మా సోదరి భువనేశ్వరీని తీసుకురావడం హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష చూస్తే కూడా అసహ్యం వేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట క్యారెక్టర్ అస్సాసియేషన్ మంచిది కాదన్నారు. అసెంబ్లీ వాగ్వాదాలు మామూలే కాని వ్యక్తిగత…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాల 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. 12 మందిలో కొందరు అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 23 నామినేషన్ కు ఆఖరు తేదీగా…
ఏపీలో రాజకీయాల రోజురోజుకు మారుతున్నాయి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ నేతలు వ్యక్తిగతంగా, తన భార్య భువనేశ్వరీ సైతం విమర్శించారంటూ.. ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సభను నిష్ర్కమించారు. అయితే అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఒక్కసారిగా విలపించారు. దీంతో తమ అభిమాన నేతను కించపరిచేలా మాట్లాడారని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. అంసెబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించారని ఆరోపణలు చేస్తూ ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నాయకుల మాటలను ఖండిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సదరు హెడ్ కానిస్టేబుల్ ఓ వీడియో విడుదల చేశారు. తను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998…
భారీ వర్షాలతో ఏపీ తడిసిముద్దయింది. ఇప్పటికే భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. కడపలో పర్యటించిన ద్వారక తిరుమలరావు బస్టాండ్, గ్యారేజ్‌ను పరిశీలించారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి ఈ రోజు సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. నిన్న రాజంపేట వరదలో ఆర్టీసీ బస్సులో ముగ్గురు…
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు, కాలనీలు నీటమునిగాయి. వరద నీటితో భగత్‌సింగ్ కాలనీ జలదిగ్బంధలో చిక్కుకుంది. వెంకటేశ్వరపురంలోని టిడ్కో గృహాలు సైతం నీటితో మునిపోయాయి. పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో పెన్నానది పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. దీంతో బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. బుచ్చిమండంలో మినగల్లు, పెనుబల్లి, కాకులపాడు, దామరమడుగు గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. వీటితో పాటు కోవూరు, ఇందుకూరుపేట, విడవటూరు…
వాయుగుండంతో భారీ వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోని పలు జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కకున్నాయి. ఈ సందర్భంగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. వరదల్లో రాజంపేట నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. పొలపత్తూరు శివాలయంలో దేపారాధనకు వెళ్లి ఎంతమంది చనిపోయింది సమాచారం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 మృతదేహాలు గుర్తించారని, మరికొందరు గల్లంతైనట్లు ఆయన తెలిపారు. శివాలయం ఘటనలో 11 నుంచి 12 మంది చనిపోయిండవచ్చని అంచనా వేస్తున్నట్లు…
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు ఈ రోజు లాటరీ నిర్వహించనున్నారు. ఈ నెల 18 వరకు కొత్త మద్యం దుకాణాలకు రూ.2లక్షలతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు లాటరీ ద్వారా కొత్త దుకాణాలను కేటాయించనున్నారు. అయితే ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో మద్యం దుకాణాల లైసెన్స్ దారులను ఎంపిక చేయనున్నారు. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన చోట ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్సీలకు 262, ఎస్టీలకు…
వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోపక్క చెరువులకు గండ్లు పడుతున్నాయి. నిన్నటివరకు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు చిత్తూరులో కొంచెం ఆగిపోయాయి. అయితే తాజాగా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మళ్లీ ఎడతెరపి లేకుండా చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా బయటకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో…
గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి చెందడంతో అధికార వైసీపీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో విజయవాడ వైసీపీలో విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలో ఆమె విజయవాడ కార్పోరేషన్‌లోని 56వ డివిజన్‌కు కార్పోరేటర్‌గా కూడా పనిచేశారు. Also Read : అనంతపురంలో కూలిన 4అంతస్థుల భవనం.. అయితే నిన్నరాత్రి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో…