తెలంగాణలో స్థానిక సంస్థల కోటాల 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. 12 మందిలో కొందరు అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ నెల 23 నామినేషన్ కు ఆఖరు తేదీగా ఉంది. 24వ తేదిన నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ ఉప సంహరణకు గడువు ఉంది. అయితే డిసెంబర్ 10వ తేదిన పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటి ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది.