నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు, కాలనీలు నీటమునిగాయి. వరద నీటితో భగత్‌సింగ్ కాలనీ జలదిగ్బంధలో చిక్కుకుంది. వెంకటేశ్వరపురంలోని టిడ్కో గృహాలు సైతం నీటితో మునిపోయాయి. పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో పెన్నానది పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. దీంతో బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది.
బుచ్చిమండంలో మినగల్లు, పెనుబల్లి, కాకులపాడు, దామరమడుగు గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. వీటితో పాటు కోవూరు, ఇందుకూరుపేట, విడవటూరు మండలాల్లో గ్రామాలు నీటమునిగాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా శ్రీరంగరాజపురంలో పొలం వద్ద ఉన్న బుచ్చయ్య అనే రైతు వరద నీటిలో చిక్కుకుని మృతి చెందాడు.
ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో నీటిలో మునిగి బుచ్చయ్య అనే రైతు మరణించాడు. ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.