ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుతో పాటు ఏపీపై విరుచుకుపడింది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి వరదలు సంభవించాయి. చెరువులకు గండ్లుపడి గ్రామాల్లోకి నీరు చేరుతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. కొన్ని గ్రామాలు వరద నీటి దిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఈ భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలం అవుతున్న వేళ మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. Read Also : What’s…
నేడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. 12 పురపాలక, నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. వర్షాల ప్రభావంతో నేడు పలు రైళ్లు రద్దు, దారి మళ్లిస్తున్నట్లు దక్షిన మధ్య రైల్వే శాఖ పేర్కొంది. విశాఖపట్నం-కడప (17488), తిరుపతి-భువనేశ్వర్ (22872)రైలు రద్దు, బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్-బిట్రగుంట (17238), చెన్నై…
యూపీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్య నల్లగా ఉందని ఆరోపిస్తూ పెళ్లయిన 9 నెలలకు ఓ భర్త విడాకులిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే… కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో ఈ ఏడాది మార్చి 7న ఓ మహిళకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమారు 3 ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించారు. మహిళ తండ్రి వద్ద మిగిలి ఉన్న భూమిని విక్రయించి…
ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల ఆధ్వర్యంలో బీజేపీ నేతలు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ…
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ-చెన్నై మార్గంలోని పడుగుపాడు వద్ద రైలుపట్టాలపైకి నీళ్లు చేరాయి. కాసేపటికే వరద ఉధృతి కారణంగా రైల్వేట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో పలు చోట్ల రైలుపట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. Read Also: అలెర్ట్ : ఏపీలో…
మోసగాళ్లు రోజురోజుకు మితిమీరి పోతున్నారు. కొత్త కొత్త పంథాలతో అమాయకులను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ ఓ కేటుగాడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌కు చెందిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులకు ప్రభుత్వం కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నమ్మబలికాడు. దీంతో సదరు వ్యక్తి మాటలు నమ్మిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులు ముడుపులు ముట్టజెప్పారు. ఇంకేముంది.. ఆ ముడుపులు తీసుకు ఆ కేటుగాడు పరారయ్యాడు. దీంతో మోసపోయామని తెలిసిన జేసీబీ, ట్రాక్టర్ల యజమానులు మహబూబాబాద్…
ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తతున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరులో అతిభారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో రోడ్లు కొట్టకుపోయాయి. వరద నీటిలో ఇప్పటికీ దాదాపు 30 మంది గల్లంతయ్యారని అధికారులు అంటున్నారు. అయితే వరదనీటిలో చిక్కుకున్న గ్రామస్తులను కాపాడేందుకు ఓ ఎస్డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ ప్రాణత్యాగం చేశాడు. 5వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన కెల్ల శ్రీనివాస్ గ్రామస్తులను కాపాడేందుకు వరదనీటిలోకి దిగాడు. ఆ గ్రామస్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అంతలోనే తన లైఫ్ జాకెట్ వరద తాకిడికి ఊడిపోవడంతో…
టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్‌గా దగ్గుబాటి రానా గత ఆగస్టులో మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో వీరి వివాహ వేడుకను హైదరాబాద్‌లోని రామనాయుడు స్టూడియోలోనే కుటుంబీకులు జరిపించారు. తెలుగు-మార్వాడీ సాంప్రదాయాల్లో జరిగిన వీరి వివాహ వేడుకకు రాయల్ స్టైల్లో నిర్వహించారు. రానా-మిహీకాల పెళ్లి సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎక్కువగా ఎవ్వరినీ ఆహ్వానించలేదు. రానాకు ఎంతో సన్నిహితుడైన న్యాచురల్ స్టార్ నాని కూడా రానా పెళ్లికి హజరుకాలేదు. అయితే తాజాగా రానాను…
ఐఎన్ఎస్ విశాఖ యుద్ధనౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం జాతికి అంకింతం చేశారు. దేశీయంగా నిర్మించిన ఈ ఐఎన్ఎస్ విశాఖ యుద్దనౌక పశ్చిమ నౌకాదళంలో సేవలందించనుంది. అయితే ముంబైలోని నౌకాదళ డాక్‌యార్డ్‌లో భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ (INS)విశాఖపట్నంను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మన అవసరాల కోసం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవసరాల కోసం కూడా భారత్ నౌకలను నిర్మిస్తుందనడంలో సందేహం లేదని అన్నారు. భారతదేశం ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నియమాల ఆధారంగా, నావిగేషన్…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులకు గండ్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల వరద బీభత్సానికి రహదారులు కొట్టుకుపోయాయి. మరి కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో రైళ్లను కూడా రద్దు చేశారు. నిన్నటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ఉదృతి తగ్గింది. ఇన్ ఫ్లో లక్షా 93వేల 710 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో…