భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ ఎన్టీవీతో మాట్లాడుతూ.. రామకృష్ణ కుటుంబం ఆస్తి వివాదం గురించి మమ్మల్ని ఆశ్రయించారని, వారి ఇష్టపూర్తిగా ఒప్పందాలు చేసుకున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుటుంబం వద్దకు రామకృష్ణ కుటుంబం రావడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని…
ఈ నెల 2న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారనికై జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షకు అనుమతులు లేవని, కోవిడ్ నిబంధనలు ఉలంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మరుసటి రోజు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టులో హజరుపరిచారు. దీంతో కోర్టు బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలో బండి సంజయ్ తరుపు లాయర్…
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని కేసీఆర్ ఆదేశించారు. నేడు కేసీఆర్ వైద్యాశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు వైద్యశాఖ ఉన్నతస్థాయి అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… హెచ్ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బండి సంజయ్ దీక్ష చేస్తున్నారంటూ పోలీసులు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను నిలిపేందుకు బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి ఈ రోజు కరీంనగర్ కోర్టులో హజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14…
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభన మొదలైంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో ఆంక్షలు విధించారు. అయితే తాజాగా భారత్‌లోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు తెలంగాణలో పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు.…
నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తానికి నాటకీయ పరిణమాల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టు హజరుపరిచారు. దీంతో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ ను…
ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం ఇంకా సర్థుమనగడం లేదు. అయితే తాజాగా ఏపీ టికెట్ల ధరలపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కన్జ్యూమర్ రైట్స్ ప్రొటక్షన్‌కు కూడా ఫోరం ఉందని ఆయన అన్నారు. ప్రోమోలు రిలీజ్ చేసి బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ చట్టం ఒకటి ఉందని, రేట్లు, సమయాలు కంట్రోల్ చేయాలని ఉందనే విషయం తెలుసా అని ఆయన ప్రశ్నించారు. జగనో, నేనో వచ్చాక పెట్టిన నిబంధనలు కావని, సినిమా రేట్లు ఫిక్స్…
కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి.. ఈ పేరు చెబితే అంతగా గుర్తు పట్టకపోవచ్చు కానీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటే మాత్రం తెలంగాణవాసులందరికీ సుపరిచితమే. ఈ రాజకీయ ప్రస్థానం కౌన్సిలర్‌గా ప్రారంభమైంది. ఆ నాటి నుంచి నేటి వరకు వివిధ పార్టీలు మారినా తన దైన శైలితో రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి, ఓ సారి చీఫ్ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంత రాజకీయ అనుభవం…
తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య పొంతన కుదరడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగ్గారెడ్డి పార్టీలో విముఖతతోనే ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి తీరుతో టీఆర్ఎస్ కోవర్టు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన నేను కేసీఆర్ కోవర్టును కాదని, నేనేవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అయితే తాజాగా మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కొత్తగా…
గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికీ వీడనంటోంది. కరోనా డెల్టా వేరియంట్‌తోనే సతమతమవుతుంటే తాజాగా మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. అయితే తాజాగా ఏపీలో 15,568 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 122 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అంతేకాకుండా గడచిన 24 గంటల్లో 103 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు, ఒకరు కరోనా బారినపడి మరణించినట్లు వైద్యాశాఖ అధికారులు…