రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు : వనమా రాఘవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ ఎన్టీవీతో మాట్లాడుతూ.. రామకృష్ణ కుటుంబం ఆస్తి వివాదం గురించి మమ్మల్ని ఆశ్రయించారని, వారి ఇష్టపూర్తిగా ఒప్పందాలు చేసుకున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుటుంబం వద్దకు రామకృష్ణ కుటుంబం రావడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని ఆయన వెల్లడించారు.
కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు, ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నది అంటూ ఆయన విమర్శించారు. నేను ఎలాంటి భూకబ్జాలు, సెటిల్ మెంట్లకు పాల్పడలేదు, రామకృష్ణ ఆత్మహత్య విషయంలో పార్టీ అధిష్టానం వివరణ కోరలేదు, వివరణ అడిగితే నేను తప్పకుండా చెబుతాను అంటూ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వీరయ్య నన్ను కాల్చాలని అన్నారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నిజాలు తెలియకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. గతం లో జరిగిన మరో ఆత్మహత్య కేసులో.. నాపై ఆధారాలు ఎందుకు రుజువు చేయలేకపోయారు. నేను సాధారణ పార్టీ కార్యకర్తను. వనమా రాఘవ రాజకీయ ఎదుగుదల చూడలేకనే ఈ ఆరోపణలు, కొత్తగూడెం ప్రజలకు త్వరలోనే నిజాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!