కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేస్తానని, గెలిచి సీఎంను అవుతానని ధీమా వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మేము బెదిరిపోయే పరిస్థితి లేదు, చంద్రబాబుకి కాలం మూడింది అని ఆయన అన్నారు. చంద్రబాబు కుప్పంలోనే పోటీ చేస్తాను అనడాన్ని ఆహ్వానిస్తున్నామని, చంద్రబాబు పోటీ చేస్తాడు, కుప్పంలో ఓడిపోతాడు. పారిపోకూడదని మేము ఆశిస్తున్నాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ ఓటమి కుప్పంలో…
భారత ప్రభుత్వం సంవత్సరానికి రైతులకు ఆరువేల రూపాయలు ఇవ్వడానికి 100 షరతులు విధిస్తోందని, ఎలాంటి షరతులు లేకుండా కేసీఆర్ రైతులకు రైతు బంధు అమలు చేస్తున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు పథకంలో 92 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు ఉన్న వారేనని ఆయన వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో రైతులు ఆయిల్ ఇంజన్ తో వ్యవసాయం చేస్తున్నారని, ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్ లో ఉచిత విద్యుత్…
గత రెండు సంవత్సరాలుగా భారత్‌తో పాటు యావత్త ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. అయితే మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి గత కొన్ని రోజుల నుంచి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీ పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల క్రితం భారత్‌లో 50 వేల లోపు నమోదైన కరోనా కేసులు, తాజాగా లక్షకుపైగా నమోదయ్యాయి. ఇలా రెట్టింపు…
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ దళిత బంధును అందజేయాలని కార్యచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటితో 50 వేల కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమకానున్నాయన్నారు.…
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం నుంచే పోటీ చేస్తానని, మళ్లీ సీఎం అవుతానని ఆయన అన్నారు. అంతేకాకుండా స్థానిక నేతలు మారకపోతే వాళ్లనే మార్చేద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని ఆయన అన్నారు. మద్యం తయారీలో రసాయనాలు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే మరో వైపు దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.…
ఇటీవల ప్రధాన మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్లారు. అయితే మోడీ కాన్వాయ్ వస్తున్న విషయం తెలిసిన అక్కడి రైతులు రోడ్డుపై బైఠాయించి మోడీ కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. సుమారు 15 నిమిషాల పాటు రైతులు అడ్డుతొలుగుతారేమోనని మోడీ ఎదురుచూశారు. అప్పటికీ రైతులు ఆందోళనను విరమించకపోవడంతో మోడీ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం దేశంలోనే హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఘటన దురదృష్టకరమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన…
ఏపీలో పీఆర్సీపీ ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు ప్రభుత్వం పీఆర్సీపై చర్చలు జరిగిపింది. ఇప్పటికే అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన అంశాలు లేవని ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. అయితే నిన్న కూడా సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. అయితే నేడు సీఎం జగన్ మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీపై సీఎం సానుకూల ప్రకటన చేస్తారని భావిస్తున్నామన్నారు.…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారు..…
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఆ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారం సమయంలో పరిమితి మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకునే ఖర్చును సవరణలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు.. అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలకు ఎంత మేర ఖర్చు చేయొచ్చనే అంశంపై సవరణ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజవర్గానికి రూ. 95 లక్షలు,…
రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా రక్కరి మరోసారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో 1,913 కొత్త కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 232 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి…