పంజాబ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా వీరేశ్ కుమార్ భవ్రా నియమితులయ్యారు. ప్రధాని మోడీ ఇటీవల పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటనకు వచ్చారు. అయితే ఈ మోడీ రోడ్డు మార్గంలో వస్తున్నారని తెలుసుకున్న రైతులు ప్రధాని మోడీ కాన్వాయ్‌కు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. సుమారు 20 నిమిషాల పాటు మోడీ కాన్వాయ్ రోడ్డుపైనే నిలిచిపోయింది. చివరికి చేసేదేంలేక మోడీ తిరిగుప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో భద్రత లోపాలు తలెత్తడంతో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ డీజీపీని మార్చివేశారు. దినకర్ గుప్తా,…
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ రోజు శెట్టిపల్లె గ్రామ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. రామకుప్పం మండలం శివాజీ నగర్‌లో అంబేద్కర్ విగ్రహ వివాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంగా ఉండే వ్యక్తి చేపల మార్కెట్ గురించి మాట్లాడుతారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతి సిమెంట్ రేటు తగ్గించరు.. కానీ సినిమా టికెట్ లు తగ్గిస్తారట అంటూ విమర్శించారు. సీఎం జగన్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించారు. ఐఆర్…
2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా క్యాడర్ ఉద్యోగుల పోస్టింగ్స్ పూర్తి చేసినట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. 22 వేల 418 మంది టీచర్‌లకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తే 21 వేల 800 మంది తమ కొత్త పోస్టుల్లో రిపోర్ట్ చేశారు.. మిగిలిన వారు కూడా ఈ రోజు రిపోర్ట్ చేస్తారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా 13 వేల 760 మంది జిల్లా క్యాడర్ ఉద్యోగులు కొత్త పోస్టుల్లో జాయిన్ అయ్యారని ఆయన పేర్కొన్నారు.…
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. అయితే కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలం తలమడ్ల గ్రామానికి ఇటీవల ఖత్తర్ నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తికి 5 రోజుల క్రితం కరోనా పాజిటివ్ తేలడంతో జీనోమ్ పరీక్షకు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో అందరూ…
మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒక్కసారి దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో కరోనా కేసులు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖలోని ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి గురకుల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది.గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ దంపతులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గురుకుల పాఠశాలలో సుమారు 570 మంది విద్యార్థులు చదువుతున్నారు. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో…
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది. అయితే దీంతో ఈ వేరియంట్ పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 20,971 కొత్త కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. అయితే మహారాష్ట్రలో 20 వేల కేసులు దాటితే లాక్‌డౌన్ విధిస్తామని మహా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే కొత్తగా నమోదైన కేసులు సంఖ్య ప్రకారం మహాలో…
తాగునీటి పైప్‌లైన్ పనులు చేస్తుండగా గ్యాస్పైపులైన్ పగిలిన ఘటన హైదరాబాద్నిజాంపేట్ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అధికారులు అప్రమత్తమై.. లీకేజీని అరికట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ ప్రధాన రహదారిలో గ్యాస్ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. గాయత్రీ టవర్ సమీపంలో జేసీబీతో నీటి పైపులైను మరమ్మతు పనులు చేస్తుండగా.. పక్కనే ఉన్న గ్యాస్ పైప్ పగిలిపోయింది. అందులో నుంచి గ్యాస్ లీకవుతుండడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ లీకవ్వడంతో…
ఎన్నో రోజులుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనపై నేడు తెరపడింది. ఈ రోజు సీఎం జగన్ 11వ పీఆర్సీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పదవీ విరమణ వయస్సు పెంపు ఊహించలేదని ఆయన అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా మేం అడగకపోయినా ఇంటి స్థలం విషయంలో నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.…
ఎన్ని రోజుల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పీఆర్పీ ప్రకటనపై తెరపడింది. ఈ రోజుల సీఎం జగన్ పీఆర్సీపీపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ విషయానికి క్లారిటీ ఇచ్చామని, ఎన్నికల్లో చెప్పినట్టుగానే 27 శాతం ఐఆర్ ఇవ్వడం చరిత్ర అని ఆయన అన్నారు. శతాబ్దంలోనే జరగని పరిణామాలు, నష్టాలు కోవిడ్ వల్ల వచ్చాయని ఆయన అన్నారు. 2020 నుంచి 2022 వరకు కోవిడ్ ప్రభావం ఉంది.. ఈ ఏడాది కూడా…
ఏపీలో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. సంక్రాంత్రి నాటికి సిలబస్ పూర్తిచేయాలని, 15 నుండి18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95శాతం వ్యాషినేషన్ పూర్తి చేశామన్నారు. విద్య సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామన్నారు. నిబంధనలు పాటించని 375 బీఈడీ, డీఈడీ, కాలేజీలు మూతపడ్డాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు…