Home
Latest News
Latest News News
-
ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు
పండుగలు వచ్చిదంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు టికెట్ల ధరలను అమాంతంగా పెంచేసి సామాన్యుడు జేబుకు చిల్లుపెడుతుంటాయి. పండుగ సమయాల్లో సుమారు టికెట్ల ధరలో సుమారు 50 శాతం అధికంగా వసూలు చేస్తుంటారు. అయితే అలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో 5 ప్రైవేట్ ట్రావెల్స్… -
కరోనా విజృంభన వేళ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి..
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ భారత్‌లో కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా నివేదిక ప్రకారం కరోనా వైరస్ పిల్లలపై కూడా దాని ప్రభావం చూపుతోంది. చిన్నారుల్లో కడుపునొప్పి, జ్వరం, వాంతులు,… -
నేడు సీఎం జగన్‌ను కలవనున్న మెగాస్టార్..
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ వైపీసీ ఎమ్మెల్యే సినిమా వాళ్లపై చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. దీనిపై తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలోని నిర్మాతలు స్పందించి సదరు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవిని సినిమా ఇండ్రస్టీకి పెద్దగా ఉండాలని కొందరు కోరగా.. నేను సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని.. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా ముందుంటానని చిరంజీవి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో సినిమా టిక్కెట్ల… -
సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వెళ్లిన వారు తిరిగి తమ సొంతూరు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో సొంతూరు వెళ్లావారితో హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీసీ బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడా చూసిన ప్రయాణికుల రద్దీగా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ భారీ ఉంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు సొంత వాహనాల్లో జనాలు సొంతూళ్లకు… -
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైకుంట ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ భక్తులు విచ్చేశారు. రాజకీయ, సీని ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1.45 గంటలకే స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. అయితే 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలో సైతం ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది. వేకువజామునుంచే స్వామి… -
ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదంపై స్పందించిన బాలకృష్ణ
ఇటీవల నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా అఖండ విజయాన్ని సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలో అఖండ చిత్రయూనిట్ థాంక్స్ మీట్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… అన్ సీజన్ లో అఖండ విడుదల చేశామని, అఖండ పాన్ ఇండియా సినిమానే కాదు పాన్ వరల్డ్ సినిమాగా మారిందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో కూడా అఖండ చెలరేగిపోతుందని, అక్కడి నుంచి వాట్సప్ వీడియోలు వస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఏపీలో… -
బలిసి కొట్టుకుంటోంది మీరే : ఎన్వీ ప్రసాద్
ఇటీవల ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. కొవ్వూరులో ప్రసన్న కూమార్ రెడ్డి అంటే ఏంటో అందరికి తెలుసునని, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉందని ఆయన అన్నారు. అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చుకోవద్దని, వంద అడుగులు పైనుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి… -
కరోనా నువ్వు తగ్గవా.. ఐఐటీ హైదరాబాద్‌లో 119 మంది విద్యార్థులకు పాజిటివ్..
కరోనా మహమ్మారి విజృంభన రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. కాలేజీల్లో, ఆఫీసుల్లో, పాఠశాలల్లో ఆఖరికి ఆసుపత్రుల్లోని వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇలా ఎక్కడా చూసినా కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. అయితే థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను తీవ్రతరం చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. తాజాగా ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌లోని విద్యార్థులకు… -
బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి : సీఎం కేసీఆర్
రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని ఆయన అన్నారు. దేశంలో రైతులను బీజేపీ బతకనిచ్చేలా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎరువుల ధరలు పెంచుతూ.. రైతుల ఆదాయం పెంచుతామన్న కేంద్రం ఖర్చులు రెట్టింపు చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ మోటర్లతో బిల్లులు వసూలు చేయడం, ధాన్యం కొనకుండా ఎరువుల… -
ఎస్బీఐ యోనో కస్టమర్ కేర్ పేరుతో 9 లక్షలు స్వాహా..
సందు దొరికితే చాలు.. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేని కొందరు ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నంబర్లను సర్చ్ చేస్తూ.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన వెంకట లక్ష్మీ అనే మహిళకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఎస్బీఐ యోనో యాప్‌ను వినియోగిస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె ఫోన్‌లో ఎస్బీఐ యోనో యాప్ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌ను సంప్రదించింది.…
తాజావార్తలు
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్‌కు గుడ్ న్యూస్..?
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..