PM Modi AP Visit: భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఆంక్షలు.. 5 కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్
- భోగాపురంలో 48 గంటల నో ఫ్లైయింగ్ జోన్..
- ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రత..
- భోగాపురం పరిసరాల్లో డ్రోన్లపై పూర్తిగా నిషేధం..
- ఐదు కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi AP Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భోగాపురం పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు భోగాపురం విమానాశ్రయం పరిసర ప్రాంతాలను 48 గంటల పాటు నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు జూలై 30 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. విమానాశ్రయం, సభా వేదిక, హెలిప్యాడ్ చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో డ్రోన్లు, యూఏవీలు (UAVలు), పారా గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వంటి ఎలాంటి గగనతల పరికరాలను వినియోగించడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
బీఎన్ఎస్ఎస్-2023 సెక్షన్ 163 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా జరిగేలా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. కాగా, విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్నారు.. దాదాపు 2 గంటలకుపైగా మోడీ పర్యటన కొనసాగనుంది.. ఆగస్టు 1వ తేదీన అంటే శనివారం రోజు ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 1.05 వరకు భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.. ఉదయం 10.45కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు మోడీ.. ఇక, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనానికి చేరుకోనున్నారు ప్రధాని.. భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు.. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం, శిలా ఫలకం ఆవిష్కరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ..
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్‌ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!