రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2.89లక్షలు వసూలు చేశారు. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సదరు వ్యక్తి బంధువులకు పంపుతామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపించారు. సైబర్ నేరగాళ్ల వేధింపులు అధికమవడంతో బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పాటు మరో వ్యక్తిని ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో 4 లక్షలు మోసం చేశారు…
కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. ఏపీలోనూ ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా రక్కసి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు.. ఇప్పటికే పలువురు సీని, రాజకీయ ప్రముఖులు కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే వైద్యులకు సైతం కరోనా సోకుతుండడం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో ఈ హీరో ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాల వైపు ద్రుష్టి సారించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కినేని సుధాకర్ తో కలిసి హీరో నందమూరి కల్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకున్న ఈ సినిమా..…
థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు విధింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని, మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్నారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని జగన్ అన్నారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించేలా చూడాలని, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో…
నిన్న వరంగల్‌లో బీజేపీ శ్రేణులు వచ్చి అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. సోమవారం మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వరంగల్‌లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని, మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ…
తగ్గేదేలే అనే విధంగా కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. దేశవ్యాప్తంగా తాజాగా 1,79,729 కొత్త కరోనా కేసులు రాగా, 146 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033 చేరింది. అయితే మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా రాష్ట్ర ఏపీ ప్రభుత్వం…
ఏపీలో ఉన్న వైసీపీది మతతత్వ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆత్మకూరులో అనుమతి లేకుండా రెండు రోజుల్లో ఇళ్ల మధ్య మసీదులు కట్టారని, ఇళ్ల మధ్య మసీదు వద్దని చెబితే చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎంతోమందిని భయబ్రాంతులకు గురి చేశారని, చట్టాన్ని రక్షించాల్సిన ఉప ముఖ్యమంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేస్తామని, టీడీపీ నుండి బీజేపీకి వచ్చిన నేతలను కోవర్టులు…
భూగర్భ జలాల సంరక్షణలో తెలంగాణ ఆదర్శప్రాయంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నేడు పచ్చని పొలాలు…పంటలు ఉన్నాయని ఆయన అన్నారు. పాలమూరుకు ఇప్పుడు వలస పోయిన కార్మికులు వెనక్కి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎకరా భూమి విలువ పది నుంచి పదిహేను లక్షలు పలుకుతోందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి అమ్ముతామంటే కొనేవారు దిక్కులేరని.. ఇప్పుడు భూమి కొందామంటే.. అమ్మేవారు లేరని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను తగ్గించడంలో తెలంగాణ…
కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు అని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్య పొలిటికల్ టూరిస్ట్‌లు వచ్చి ఏదోదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా 64 లక్షల మంది రైతుల ఖాతాలోకి 50 వేల కోట్లు జమ అయ్యిందని, తెలంగాణ రాకంటే ముందు ఈ ప్రాంత పరిస్థితి బోర్ల కింద పంటలు.. బోర్ల పడ్డ బతుకులుగా ఉండేవన్నారు. సమైక్య పాలనలో…
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం ఇటీవల విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సురేష్ సెల్ఫీవీడియో లభ్యమైంది. అయితే ఈ సెల్ఫీ వీడియోని కుటుంబసభ్యులు పోలీసులకు అందజేశారు. జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలు వడ్డీరూపంలో చెల్లించానని, వడ్డీ వ్యాపారి గణేష్‌కి రూ.80 లక్షలు చెల్లించానని వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సెల్ఫీవీడియోలో సురేష్…