ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. అంతేకాకుండా ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి చాపకింద నీరులా తయారైంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసులతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంక్య 4,033కు చేరుకుంది. అయితే ఒమిక్రాన్ బాధితుల్లో 1,552…
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ వేయించుకోవాలంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌లు వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బూస్టర్ డోస్‌ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. చార్నినార్‌లోని యునాని ఆసుపత్రిలో బూస్టర్ డోస్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317ను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బదిలీలకు నిరసన జూనియర్ లెక్చరర్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోలనకు దిగారు. బదిలీల్లో న్యాయం చేయాలని మంత్రి సబిత ఇంటి ముందు జూనియర్ లెక్టరర్లు బైఠాయించారు.…
యావత్తు ప్రపంచ దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా బారిన పడి ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ప్రజలు ఇప్పుడు థర్డ్‌వేవ్‌తో తలమునకలవుతున్నారు. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే కరోనా కష్టకాలంలో సైతం నిర్వారామంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు పోలీసులు కరోనా బారినపడగా.. తాజాగా…
కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం భారత్‌లో కనిపిస్తోంది. అనుకున్నదానికంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. గత 10 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 50 వేల లోపు నమోదైన కరోనా కేసులు కేసులు ఇప్పుడు లక్ష 50 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 1,79,723…
నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువుల్లో నీటిమట్టం పెరిగింది. కొన్ని చోట్ల అకాల వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. భారీ వర్షాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పాడ్డాయి. ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు బలమైవ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఆంధ్రాకు వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఊరెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరో 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఈ నెల 12, 13 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా మీదుగా 4 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడ 5(82724). సికింద్రాబాద్ -విశాఖపట్నం(82719) సువిధ ప్రత్యేక రైళ్లు ఈ నెల 12న,కాకినాడటౌన్-సికింద్రాబాద్ (07450), విశాఖపట్నం-సికింద్రాబాద్…
పండుగలకు విందుభోజనం చేయడం మాములే.. అయితే విందుభోజనం కోసం మేక మాంసమో లేక చికెన్‌ను కొనుగోలు చేయాలి.. కానీ ఓ ఇద్దరు వ్యక్తులు మేకలు దొంగతనం చేసి సంక్రాంతి విందుభోజనం చేద్దామనుకున్నారు. కానీ చివరికి మేకలు ట్విస్ట్ ఇవ్వడంతో జైలు పాలయ్యాడు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మేకల గుంపులోని మేకను దొంగతనం చేసేందుకు ఇద్దరు రాత్రి వెళ్లారు. మేక గుంపులోకి వెళ్లారు తీరా మేకను దొంగతనం చేద్దామనుకొని మేకను పట్టుకునే…
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ఎంతో మంది జీవితాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. మొన్నటి వరకు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడం, ఒమిక్రాన్ ఇండియాలో వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో సైతం కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న…
కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మరోసారి విజృంభిస్తోంది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో సైతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా, ఒమిక్రాన్ కట్టడికి బూస్టర్ డోస్‌ను వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించడంతో దేశంలోని పలు రాష్ట్రాలో బూస్టర్ డోస్‌లు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…