పసిఫిక్ ద్వీపకల్పం టోంగాలో అగ్నిపర్వతం బద్దలైంది. సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం పేలింది. దీంతో హవాయి, అలస్కా, యూఎస్ పసిఫిక్ కోస్ట్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అగ్ని పర్వతం విస్ఫోటనం తర్వాత భారీగా పొగ, బూడిద ఎగిసిపడుతోంది. టోంగా రాజధాని నుకులోఫాలో 12 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ తీరానికి అమెరికా వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సునామీ హెచ్చరికల దృష్ట్యా యూఎస్ పశ్చిమ తీరంలోని బీచ్‌లు మూసివేశారు.
అంతేకాకుండా హవాయి, అలస్కా, యూఎస్ పసిఫిక్ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే యూఎస్ ప్రభుత్వం సునామీని ఎదుర్కునేందుకు ముందస్తు చర్యలు ప్రారంభించింది. సునామీతో దెబ్బతినే ప్రాంతాలను అంచనావేసి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టింది.