Vishal Vishnu : విష్ణు విశాల్ తో రవితేజ ‘మట్టి కుస్తీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమాతో సందడి చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ చేయబోతున్నాడు. ఈ తాజా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలయింది. మంగళవాయిద్యాలతో శుభకరంగా ఈ పిక్ మొదలవుతుంది. ‘వీరా వెడ్స్ కీర్తి’ అనీ కనిపిస్తుంది. ఓ వైపు పెళ్ళితంతు, మరోవైపు కుస్తీ పోరుకు సంబంధించిన ఇమేజెస్. చివరలో ‘మట్టి కుస్తీ’ టైటిల్ దర్శనమిస్తుంది. ‘ఎఫ్.ఐ.ఆర్.’ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ సమర్పకునిగా వ్యవహరించారు. ఈ సినిమాకు కూడా రవితేజ సమర్పకుడు కావడం విశేషం. ఈ సినిమా విష్ణు విశాల్ సొంత చిత్రం. చల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు.
‘మట్టి కుస్తీ’ మోషన్ పిక్ ను తన సోషల్ మీడియాలో రవితేజ విడుదల చేస్తూ, “ఆటల చుట్టూ తిరిగే కథలతో రూపొందే చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, క్రీడా నేపథ్యంలో వినోదం పంచబోతున్న ఈ చిత్రాన్ని సమర్పించడం ఆనందంగా ఉందని” ట్వీట్ చేశారు. మరి రవితేజకు, విష్ణు విశాల్ కు ఉన్న అనుబంధమేమిటో కానీ, మొత్తానికి ‘మట్టి కుస్తీ’ మోషన్ పిక్ ఆకట్టుకొనేలా ఉంది. ఈ ‘మట్టి కుస్తీ’ ఎప్పుడు ఎలా మొదలై, ఏ తీరున తెరకెక్కి, ఏ రీతిన జనం ముందు నిలుస్తుందో చూడాలి.
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?