మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే అపోలో వైద్యులు నిత్యం ఆయనను పరీక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. కాకపోతే కొద్దిగా జలుబు, ఒంటి నొప్పులు ఉన్నాయని, జ్వరం పూర్తిగా తగ్గినట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. వైద్యుల సూచనలు మరియు సలహాలతో డైట్ ఫాలో అవుతూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా కోడలు ఉపాసన…