Today (31-12-22) Business Headlines: తెలంగాణ వ్యక్తికి కీలక పదవి: రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా విద్యుత్‌ను సరఫరా చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న NLC ఇండియా అనే సంస్థకు తాత్కాలిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించారు. ఈ కీలక పదవి తెలంగాణకు చెందిన కలసాని మోహన్‌రెడ్డికి దక్కటం విశేషం. ఈయన ఇప్పుడు ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ ప్లానింగ్ విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
8 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు మన విదేశీ మారక నిల్వలు ఈ నెల 8వ తేదీ నాటికి 8 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫారెక్స్ రిజర్వ్‌లను పెంచేందుకు ఆర్బీఐ ఈ నెల 6వ తేదీన కొన్ని చర్యలను ప్రకటించింది. అయితే ఆ చర్యల ఫలితాలు కనిపించటానికి కొంచెం టైం పడుతుందని ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు 580.3 బిలియన్ డాలర్లు ఉన్నాయి. 8 పైసలు కోలుకున్న రూపాయి. ఇటీవలి కాలంలో రికార్డు…