Today (31-12-22) Business Headlines:
తెలంగాణ వ్యక్తికి కీలక పదవి: రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా విద్యుత్‌ను సరఫరా చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న NLC ఇండియా అనే సంస్థకు తాత్కాలిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించారు. ఈ కీలక పదవి తెలంగాణకు చెందిన కలసాని మోహన్‌రెడ్డికి దక్కటం విశేషం. ఈయన ఇప్పుడు ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ ప్లానింగ్ విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రేపటి నుంచి కొత్త బాధ్యతలు చేపడతారు. ఫుల్ టైం సీఎండీ వచ్చే వరకు ఉంటారు. NLC ఇండియాను గతంలో నైవేలీ లిగ్నైట్‌గా పేర్కొనేవారు.
కేజీ బేసిన్ గ్యాస్.. కొనండహో
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి బేసిన్ డీ6 క్షేత్రంలో వెలికితీసే గ్యాస్ కొనేందుకు సంస్థలు ముందుకు రావాలని రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఆహ్వానించింది. జపాన్ మరియు కొరియా దేశాలు కొనుగోలు చేసే రేటు కన్నా తక్కువకు బిడ్‌లు దాఖలు చేయొద్దని సూచించింది. ఈ రెండు దేశాలు ప్రస్తుతం ఒక ఎంఎంటీబీయూ గ్యాస్‌కి 28 పాయింట్ ఎనిమిది మూడు డాలర్లు వెచ్చిస్తున్నాయి. ఈ ధర కన్నా 5 డాలర్ల తక్కువకు బిడ్‌లు వేయొచ్చొని, అంతకంటే తక్కువైతే వద్దని స్పష్టం చేసింది. ఫిబ్రవరి నుంచి నిత్యం 60 లక్షల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఈ ఫీల్డ్ నుంచి సప్లై చేస్తామని రిలయెన్స్ పేర్కొంది.
నవంబర్‌లో 8 సెక్టార్లు వెరీ నైస్
ఈ ఏడాది నవంబర్‌లో ఎనిమిది ప్రధాన రంగాలు మంచి పనితీరు కనబరిచాయి. ఉమ్మడిగా 5 పాయింట్ 4 శాతం గ్రోత్‌ను నమోదు చేశాయి. విడివిడిగా చూస్తే.. బొగ్గు రంగం 12 పాయింట్ 3 శాతం, ఎరువుల రంగం 6 పాయింట్ 4 శాతం, ఉక్కు రంగం10 పాయింట్ 8 శాతం, సిమెంట్ రంగం 28 పాయింట్ 6 శాతం, విద్యుత్ ఉత్పత్తి రంగం 12 పాయింట్ 1 శాతం వృద్ధి చెందింది. 2022లో క్రూడాయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు తిరోగమనం చేశాయి. మౌలిక రంగం గతేడాది నవంబర్‌లో 3 పాయింట్ 2 శాతం మాత్రమే గ్రోత్ అవగా ఈ సారి 5 పాయింట్ 4 శాతం పురోగమించటం చెప్పుకోదగ్గ విషయం.
పెరిగిన ‘చిన్న మొత్తాల’ వడ్డీలు
చిన్న మొత్తాల పొదుపు.. బతుకు భద్రం.. భవిత బంగారం.. అని అప్పట్లో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేది. ఆ ప్రకటనలకు తగ్గట్లే ఇప్పుడు ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. 2023 మార్చితో ముగిసే మూడు నెలల కాలానికి చెల్లించనున్న వడ్డీ రేట్లను 1 పాయింట్ 1 శాతం మేరకు పెంచింది. పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ వంటి పథకాలకు ఇది వర్తిస్తుంది. అయితే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజనపై చెల్లించే వడ్డీ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
హీరో తొలి ఇ-స్కూటర్ డెలివరీ
హీరో మోటో కార్ప్ సంస్థ తొలిసారిగా రూపొందించిన విద్యుత్ స్కూటర్.. విడా వీ1. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ బెంగళూరులో ప్రారంభమైంది. కొద్ది రోజుల్లో జైపూర్, ఢిల్లీల్లోనూ స్టార్ట్ కానుందని ప్రకటించింది. గంటకు 80 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ టూవీలర్ వెహికిల్‌లో రెండు వేరియెంట్లు ఉన్నాయి. విడా వీ1 ఎక్స్‌షోరూమ్ రేటు లక్షా 35 వేల 705 రూపాయలు. వీ1 ప్రో ధర లక్షా 46 వేల 880 రూపాయలు. రేపటి నుంచి 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో హీరో సంస్థ ఈ డెలివరీ ప్రకటన చేయటం వినియోగదారులకు న్యూ ఇయర్ విశెష్‌గా చెప్పుకోవచ్చు.
2వ వారమూ ‘ఫారెక్స్’ డౌన్
ఇండియా విదేశీ మారక నిల్వలు వరుసగా రెండో వారం కూడా తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు వారం 571 మిలియన్ డాలర్లు కరిగిపోగా.. తాజాగా.. అంత కంటే ఎక్కువ.. అంటే.. 691 మిలియన్ డాలర్లు మైనస్ అయ్యాయి. దీంతో మొత్తం నిల్వలు 562 పాయింట్ ఎనిమిది సున్నా ఎనిమిది బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి. ఈ నెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న శుక్రవారం వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో మన విదేశీ మారక నిల్వలు ఆల్‌టైం రికార్డు లెవల్‌లో 645 బిలియన్ డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే.