Apple Price Hike: భారీ వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండ చరియల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో పండిన పంట సరఫరాలో జాప్యం కారణంగా టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. దీంతో టమాటాలు, ఇతర కూరగాయలతో పాటు పండ్ల సరఫరా కూడా దెబ్బతింది.
ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
శుక్రవారం చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం సియుల్ నదిలో పడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షల్‌వాడి గ్రామంలో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటంతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దత్తత తీసుకోనున్నట్లు శివసేన తెలిపింది.
Landslide: మహారాష్ట్రలోని రాయగఢ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో 30కి పైగా కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయని భయాందోళన చెందుతున్నారు.
Joshimath Sinking: ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణం కుంగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. శనివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్ లో పర్యటించారు. ప్రమాదం అంచున ఉన్న ఇళ్లలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే 500 పైగా ఇళ్లు, పలు రోడ్లు బీటలువారాయి. ఇదిలా ఉంటే జోషిమఠ్ సంక్షోభంపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉత్తరాఖండ్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు హాజరుకానున్నారు.
మయన్మార్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రంలోని జాడే గనుల్లో కార్మికులు పనిచేస్తుండా హటాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో 70 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఖనిజాల గనుల్లో జాడే గనులు ఒకటి. పెద్ద గనులు మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన గనులు కూడా. Read: ఒమిక్రాన్‌పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు… ఈ…
భారీ వర్షాలతో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇక, తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేశాయి.. తిరుమల ఘాట్ రోడ్డులు కోతకు గురయ్యాయి.. ఏకంగా 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, నాలుగు ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతినడంతో.. తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు కూడా విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇవాళ తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించనుంది ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం. Read Also: జవాద్ తుఫాన్ ఎఫెక్ట్..…