ప్రకృతి అంటే ఆమెకు ఎంతో ఇష్టం.. అందుకే తరచూ వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ.. ఆ జర్నీలోని అనుభవాలను, అనుభూతులను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. కానీ, తాను ట్వీట్ చేసిన అరగంటలోపే ఆ ప్రకృతి ప్రకోపానికే బలిఅవుతానని ఊహించి ఉండదు.. ఇప్పుడా ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప శర్మ.. ఈ సృష్టిలోని ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేస్తూ వచ్చారు..…
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. ఇక, భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 36 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు.. మరికొంతమంది గల్లంతు కాగా.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి.. ఇప్పటికే కొందరిని కాపాటినట్టు తెలుస్తుండగా.. శిథిలాల కింది ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై వివరాలు లేవు..…