జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చోసిటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మంది గాయపడ్డారు. 220 మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు. మృతుల్లో ఇద్దరు CISF జవాన్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమిత్ షాకు పరిస్థితి గురించి తెలియజేశారు. శిథిలాల కింద లేదా ప్రమాదంలో చిక్కుకున్న ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి సహాయ సిబ్బంది గంటల తరబడి కష్టపడి పనిచేస్తున్నారు. సహాయ…
జమ్మూకాశ్మీర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రియాసి కొండచరియలు విరిగిపడి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు అక్కడికక్కడే మరణించారు.
జమ్మూలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మిజోరంలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు దాటికి కొండచరియలు విరిగిపడి కవాన్‌పుయ్‌లో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ కుప్ప కూలింది.
Landslides : ఇథియోపియాలోని వోలాటా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 13 మంది మరణించారు. చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Uttarkhand : ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ, కేదార్‌నాథ్ నడక మార్గంలో కొండపై నుండి శిథిలాలు పడిపోవడం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారు..
Nepal : నేపాల్‌లో ఈ ఉదయం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ రాజధానిలో ఆదివారం ఉదయం మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి పరిస్థితులు తలెత్తాయి.