Indonesia : ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 19 మంది మరణించారు. ఏడుగురు తప్పిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Congo Rains: ఆఫ్రికా ఖండంలో రెండో అతిపెద్ద దేశమైన కాంగోలో వరదలు, కొండచరియలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బుకావు నగరంలో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, ఇళ్లు కూలి 14 మంది మరణించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు.. అల్లూరి ఏజెన్సీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి..
Apple Price Hike: భారీ వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండ చరియల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో పండిన పంట సరఫరాలో జాప్యం కారణంగా టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. దీంతో టమాటాలు, ఇతర కూరగాయలతో పాటు పండ్ల సరఫరా కూడా దెబ్బతింది.
ఉత్తరాఖండ్లో విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.