Landslides : ఇథియోపియాలోని వోలాటా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 13 మంది మరణించారు. చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు సోమవారం స్థానిక అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 300 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, గల్లంతైన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదని వోలైటా మండల ప్రధాన పరిపాలనాధికారి శామ్యూల్ ఫోలా తెలిపారు.
Read Also:Double Ismart: జెట్ స్పీడ్ లో డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
మృతి చెందిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని ఫోలా తెలిపారు. మరో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందన్న భయంతో ముందుజాగ్రత్తగా 300 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వోలైటా ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత నెల ప్రారంభంలో దక్షిణ ఇథియోపియాలోని మరొక ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి పైగా మరణించారు.
Read Also:Mangala Gowri Vratham: శ్రావణ మంగళగౌరీ వ్రత ఆరంభ శుభసమయాన ఈ స్తోత్రాలు వింటే..