ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు అమరుల, తాడిత పీడితుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్థూపంగా ప్రమాణం…
అయోధ్యలో రామమందిరం కట్టిన తర్వాత ఇప్పుడు భక్తులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా భూముల ధరలు విపరీతంగా పెరిగి పాత వృత్తులు కాకుండా కొత్త వృత్తులు అవలంబిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ భూమి కొనుగోలు నుండి హోటల్ వ్యాపారం వరకు, అయోధ్య ప్రజలు కొత్త ఉపాధి కోసం చూస్తున్నారు. అయోధ్యలోని నయా ఘాట్‌కు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిహురా మజ్హాన్ గ్రామంలో అమితాబ్ బచ్చన్ భూమిని కొనుగోలు…
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలోని జమున హ్యాచరిస్ భూముల వ్యవహారం తేల్చేపనిలో అధికారులు ఉన్నారు.. అధికారులతో పలు దఫాలుగా కలెక్టర్ చర్చలు జరిపారు.. ఈ రోజు, రేపు సంబంధిత రైతులకు భూములను పంపిణీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది..
ఈమధ్యకాలంలో ఐటీ శాఖ వరుస దాడులతో కలకలం రేపుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఆదాయపన్ను శాఖ దాడులు కొందరు వ్యాపారుల్ని వణికించాయి. ఆదాయానికి మించి ఆస్తులు , పెద్ద మొత్తంలో భూములు కోనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తిరుపతికి చెందిన ఐటి శాఖ అధికారులు వడ్డీ వ్యాపారి ఇంట్లో దాడులు నిర్వహించారు . తుమ్మళ్లకుంటకు చెందిన రమణారెడ్డి అలియాస్ పంచె రెడ్డి 1991లో గ్రామంలో ఉన్న రెండు…
భూముల రీ-సర్వేపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్. భూముల రీ-సర్వే అనేది సీఎం జగన్ మానస పుత్రిక. ప్రతి 30 ఏళ్లకోసారి రీ-సర్వే చేయాలని నిబంధనలు.కానీ పొలం గట్ల తగాదాలు వస్తాయి.. పెద్ద గొడవలు అవుతాయనే ఆందోళనతో ఎవ్వరూ రీ-సర్వే చేయించేందుకు సాహసించ లేదు. దీంతో ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి సర్వే వివరాలే ఉన్నాయన్నారు. కానీ సీఎం జగన్ సాహసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రీ-సర్వేలో భాగంగా ఏమైనా…