భారత్‌లో గత కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతిరోజు డైలీ సీరియల్‌లాగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయితే అక్టోబర్ 27న మాత్రం దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో మాత్రం బెల్లెట్లు కలకలం రేపాయి.
తమిళనాడులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. దీంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది హడలెత్తిపోయారు. మస్కట్ నుంచి 146 మంది ప్రయాణికులతో చెన్నై చేరుకుంది.
చైనాలో నెబ్యులా-1 అనే రాకెట్ బ్లాస్ట్ అయింది. ప్రయోగం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రాకెట్ చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ కంపెనీకి చెందినది. ఈ రాకెట్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. అయితే మిషన్ కోసం నిర్దేశించిన 11 లక్ష్యాలలో 10 సాధించినట్లు కంపెనీ తెలిపింది.
సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV792 విమానం పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణంగా టైర్‌కు మంటలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మీడియా నివేదికల ప్రకారం.. మొత్తం 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు.
బీహార్‌లోని ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎల్‌జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో చిరాగ్ పాశ్వాన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్‌లో ఎన్నికల సభలో ప్రసంగించేందుకు వెళ్లిన చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్‌పై నుంచి కిందకు దిగడంతో చక్రాలు భూమిలోకి వెళ్లాయి.
జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందుకోసం ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. మరోవైపు చంద్రయాన్-3 లైవ్ చూడటానికి పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకు తగ్గట్టు.. చంద్రయాన్ విజయవంతమైతే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Reasons Behind Luna-25 Crash: చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేరుకొని ఆ ఘనత సాధించిన తొలి దేశంగా రికార్డు క్రియేట్ చేయాలని భారత్ భావిస్తున్న తరుణంలో రష్యా దానికి బ్రేక్ వేయాలని చూసింది. హడావుడిగా లూనా-25ను చంద్రుని దక్షిణ ధ్రువంపై దింపాలని చూసింది. అయితే ఆ ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది. 47 సంవత్సరాల తరువాత జాబిల్లిపై ప్రయోగం చేయడానికి రష్యా పూనుకుంది. ఇండియా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాని కంటే ముందు తమ లూనా 25…
Chandrayaan 3 Postpone: చంద్రుని పై ప్రయోగం చేయడానికి రష్యా చేపట్టిన లూనా-25 కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3 వైపు చూస్తోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలక దశలో ఉందని ఇస్రో తెలిపింది. రేపు చంద్రయాన్ 3 చందమామపై అడుగుపెడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇస్రో ఓ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు పరిస్థితులు అనుకూలిస్తేనే ఇస్రో ల్యాండింగ్‌కు ముందుకు వెళుతుందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ల్యాండర్…