Chirag Paswan: చిరాగ్ పాశ్వాన్కు తప్పిన ముప్పు.. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎల్‌జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో చిరాగ్ పాశ్వాన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్‌లో ఎన్నికల సభలో ప్రసంగించేందుకు వెళ్లిన చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్‌పై నుంచి కిందకు దిగడంతో చక్రాలు భూమిలోకి వెళ్లాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అయితే.. ఈ ఘటన జరిగిన అనంతరం చిరాగ్ పాశ్వాన్ బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకుముందు అమిత్ షా హెలికాప్టర్ కూడా బెగుసరాయ్‌లో ప్రమాదానికి గురికాకుండా తృటిలో తప్పించుకోవడం గమనార్హం.
Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలకు ఇస్తాం..
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
కాగా.. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలిప్యాడ్ ను ఇటుకలతో తయారు చేశారు. అంతేకాకుండా.. దాని చుట్టూ బురద ఉంది. ల్యాండింగ్ కోసం వచ్చిన హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే.. ఒక చక్రం మట్టిలోకి దూరింది. అయితే పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటనను చిరాగ్ పాశ్వాన్ కార్యాలయం విడుదల చేసింది. ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్‌డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి నిత్యానంద్‌రాయ్ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. ఆయనకు అనుకూలంగా మొహద్దీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళ్లారు.
Mondithoka Jaganmohan Rao: ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మొండితోక జగన్మోహన్ రావు..
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?