Fake Call : విమానాలు, రైళ్లకు ఫేక్ బెదిరింపు కాల్స్ రావడం మళ్లీ ఎక్కువైపోయింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్లోని వ్యక్తే బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేయడంతో.. అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి బాంబులేదని తేల్చడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.