బుధవారం అర్థరాత్రి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఓ గ్రామంలో భూ వివాదంపై జరిగిన ఘర్షణలో రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సంగారెడ్డి జిల్లా ఝారసంఘం మండలం మాచనూరు గ్రామంలో భూ వివాదం తారాస్థాయికి చేరింది. భూమి కోసం బయటి నుంచి కిరాయి వ్యక్తులను తెప్పించి స్వరాజ్ అనే రైతు, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.
కరీంనగర్ జిల్లాలోని దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలంలో రామకృష్ణ కాలనీలో తల్లీకూతుళ్లపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడిచేశారు. ఈదాడిలో కూతురు అక్కడికక్కడే మరణించగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.