‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అని ఓ కవి సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలను చూసి చలించిపోయి రాసిన పాట ఇది. అచ్చం అలాగే జరుగుతున్నాయి నేరాలు-ఘోరాలు.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా గుహ గ్రామంలో కొందరు ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు భక్తులను, పూజారిని కొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఈనెల 9న లార్డ్ కనిఫ్నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు, పూజారిపై ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajasthan: రాజస్థాన్ లో దారుణం జరిగింది. భూమి విషయంలో తగాదా ఒకరి దారుణ హత్యకి కారణమైంది. ఒక వ్యక్తి తన సోదరుడిపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఒకసారి కాదు 8 సార్లు అతనిని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్‌పూర్ లో చోటు చేసుకుంది.
భూవివాదం తెచ్చిన గొడవతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు, మరికొంత మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జరిగింది.
Tragic Incident: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన 17 నెలల కొడుకును బావిలో విసిరి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారి నీటిలో మునిగి చనిపోగా, తండ్రి చావుబతుకుల మధ్య తిరుగుతున్నాడు.
Son Kill Father: నేటి సమాజంలో మనుషులు రక్త సంబంధాలను కూడా మర్చిపోతున్నారు. డబ్బు కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.
మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో భూవివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కారంపొడి, కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి.
రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ సర్కార్ మరో సంక్షోభం ఏర్పడింది. ఓవైపు సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, ప్రభుత్వంలోని మంత్రుల తీరుతో గెహ్లాట్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఆస్తి కోసం కన్న తండ్రినే చంపేశాడో కొడుకు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. హమీర్‌పూర్ జిల్లాలో భూ వివాదం కారణంగా కలుయాగి కుమారుడు తన తండ్రిని పదునైన ఆయుధంతో హత్య చేశాడు. ఈ ఘటనలో మృతుడి మనవడు కూడా ఉన్నాడు.
జనగామ జిల్లా సోలిపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తరిగొప్పుల మండలం సోలిపురం శివారులో భూవివాదంలో ఘర్షణ జరిగింది. గొల్ల కురుమలకు సంబంధించిన భూమిపై అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ నాటుతుండగా గొల్లకురుమలు అడ్డుకున్నారు.