Fight For Land: భూమి నేడు బంగారం అయిపోయింది. అలాగే గజం జాగ కోసం కుటుంబ బంధాలను కూడా కాదనుకుంటున్నారు. భూతగాదాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. పొలం గెట్ల మధ్య, కొన్నిసార్లు నీరు లేదా ఆనకట్ట కారణంగా ఇద్దరిమధ్య గొడవలు తలెత్తుతాయి. తాజాగా నాసిక్‌లోని కల్వాన్ తాలూకాలోని గండల్‌మోఖ్, తిర్హాల్ గ్రామాలలో రెండు గ్రూపుల రైతుల మధ్య భూమి వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆ గొడవ తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Dead Body In Plastic Bag: తల్లి చంపి ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టిన కూతురు
తొలుత పంచాయతీ మేరకు ఇరు వర్గాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలోనే వారి మధ్య మాటలు ఉధృతమయ్యాయి. తర్వాత గొడవ పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇందులో ఒకరి తలలు మరొకరు పగులగొట్టి గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో వారిని కొట్టిన గుంపుపై అభోనా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రూరల్ పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.
Read Also: Funny : వారెవ్వా.. ఏం ఫీల్డింగ్ బాసూ.. క్రికెట్లో నిన్ను మించిన వారే లేరు పో
ఇంతలో అక్కడున్న రైతులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఇందులో ఇరువర్గాల రైతులు పరస్పరం దుర్భాషలాడుతున్నారు. ఏది పడితే అది ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. రైతులు లేదా సోదరుల మధ్య వివాదాలు మహారాష్ట్రకు కొత్త కాదు. అయితే ఈ గొడవ వీడియో వెలుగులోకి రావడంతో ఈ గొడవపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో మహిళలు కూడా గాయపడ్డారు. ఈ క్రమంలో చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
नाशिक जिल्ह्यातील कळवण मध्ये जमिनीच्या वादातून दोन गटात तुंबळ हाणामारी, व्हिडिओ व्हायरल #farmer #viralvideo #Nashik pic.twitter.com/LKgpM6acvG
— Kiran Balasaheb Tajne (@kirantajne) March 15, 2023