Parigi : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అధికారుల చర్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తుంకులగడ్డ ప్రాంతంలో ప్రభుత్వంచే కేటాయించిన ఇళ్ల స్థలంలో లబ్ధిదారుడు ఇల్లు నిర్మించేందుకు బునాది గోడలు నిర్మిస్తుండగా, పరిగి తహసీల్దారు జేసీబీతో వచ్చి వాటిని ధ్వంసం చేశారు. అంతేకాదు, ఈ ఘటనను వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై స్థానికులు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. 2002లో సర్వే నంబర్ 530లో…
Hyderabad: హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి టోలిచౌకీలో రెండు గుంపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గోల్కొండకు చెందిన షకీల్ కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం అందిందని డీఐ బాలకృష్ణ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, ప్రాథమిక విచారణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తప్ప గన్…
నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారిగా హడావుడి సృష్టించిన సూర్య ప్రకాష్.. అసలు బాగోతం కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఆస్తికోసం, డబ్బుల కోసం కన్నతల్లిని, సొంత తమ్ముడిని అతని కుటుంబాన్ని కూడా బెదిరించాడు. సుమారు రూ.70 లక్షల వరకు నగదు, బంగారం, ఆస్తులు కాజేసి రోడ్డున పడేశాడు.
Fake IPS : పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఓ నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి కేసును ఛేదించారు. 41 ఏళ్ల బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ట్రైనీ ఐపీఎస్ అధికారిగా వేషధారణ చేసి యూనిఫామ్‌లో పవన్ కల్యాణ్ పర్యటనకు హాజరైనట్టు ఏఎస్‌పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. అతను పార్కింగ్ స్థలం వద్ద…
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారు. క్లాస్‌రూమ్‌లో ఉండగానే దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఇంతవరకు ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యుల ఆందోళనకు గురయ్యారు.
UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. భూ వివాదంలో ఇరుగుపొరుగు వారిని ఇరికించేందుకు ఓ తండ్రి కన్న కూతురినే హతమార్చాడు. ఈ ఘటన ఖుషినగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నలుగురు పిల్లల్లో చిన్నదైన కూతురు గొంతు కోసి హత్య చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన దాదాపు రెండు వారాల తర్వాత మంగళవారం నిందితుడు జయనారాయణ్ సింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా లగచర్ల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి ఘటనలో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ నేత సురేష్‌కు అసలు భూమి లేదని వికారాబాద్ కలెక్టర్ తేల్చిచెప్పారు.
రాజోలు నియోజకవర్గంలో ఘర్షణ చోటు చేసుకుంది.. మల్కీపురం మండలం అడవిపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో గ్రామ సర్పంచ్, ఆమె భర్త, వార్డు మెంబర్లపై దాడి జరిగింది.. 2021లో నూతనంగా ఏర్పడింది అడవిపాలెం పంచాయతీ.. అయితే, నూతన పంచాయతీకి భవనం లేకపోవడంతో 1 ఎకరం 96 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమిని సర్వే చేస్తున్న సమయంలో రగడ మొదలైంది.. కొంత మంది దళితులు 1 ఎకరం 96 సెంట్లు భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి
Haryana : హర్యానాలోని అంబాలాలో అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో భూ వివాదంలో పార్టీల మధ్య జరిగిన భీకర పోరులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడినట్లు సమాచారం.