వరకట్నం కోసం వేధించేవారు మాత్రం మారటం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. తాజాగా విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలి అయింది. విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రియుడు మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన దిల్షాద్ అనే మహిళకు తమిళనాడుకు చెందిన హుస్సేన్‌తో వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ప్రేమించానని చెప్పి నీలి చిత్రాలను తీశాడో ప్రబుద్ధుడు. ఆమె నీలి చిత్రాలు తీసి గ్రామస్తులకు బంధువులకు పంపడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పోకిరీల ఆగడాలు పెరిగిపోయాయి. వారి వికృత చేష్టలకు మహిళలు,యువతులు బలవుతున్నారు. వీరఘట్టం మండలం నడుకురు సంఘటన మరువక ముందే రేగిడి మండలం కొత్త చెలికానివలస గ్రామంలో మరొక సంఘటన చోటుచేసుకుంది. దళిత యువతిపై దుర్మార్గానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ప్రేమించానని నమ్మించి నీలిచిత్రాలను చిత్రీకరించాడు. మద్యం మత్తులో నీలి చిత్రాలను కుటుంబీకులకు…