Dowry Harassment: ఉప్పల్‌లో దారుణం జరిగింది. వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రాలోని ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్‌తో సంధ్యారాణికి సంవత్సరం క్రితం వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో పెళ్లి కోసమని, వరకట్నం కింద మూడు లక్షల పదివేల నగదు, పది తులాల బంగారం, ఫర్నిచర్ ఇచ్చారు. అయితే పెళ్ళికొడుకు ప్రవీణ్ కుమార్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో పెళ్లయిన రెండు నెలలకే హైదరాబాద్ వచ్చి కాపురం పెట్టారు కొద్దిరోజులు బాగానే ఉన్నారు, అంతలోనే అదనంగా వరకట్నం కావాలని సంధ్య రాణిని వేధించడం మొదలు పెట్టాడు.
Also Read: Telangana: సీఎస్ శాంతికుమారితో కేంద్ర బృందం భేటీ
ఈ విషయం అమ్మాయి తల్లికి చెప్పగా.. అదనంగా వరకట్నం ఇవ్వలేనని అల్లుడితో చెప్పింది. అదనంగా వరకట్నం ఇవ్వకపోవడంతో భార్య పట్ల క్రూరంగా భర్త వ్యవహరించాడు. దీంతో అతని వేధింపులు భరించలేక సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సంధ్యారాణి తల్లి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు