Sonam Wangchuk: లడఖ్ రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మంగళవారం లేహ్‌లో తన నిరాహార దీక్షను విమరించారు. మైనర్ బాలిక ఇచ్చిన నిమ్మరసాన్ని తాగి నిరాహార దీక్షను విరమించారు.
దేశంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (Weather Alert) హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
China: డ్రాగన్ కంట్రీ చైనా తన బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. ప్రతీ విషయంలో భారత్‌ని చికాకు పెట్టేందుకే ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇటీవల సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది. ఈ విషయంపై కూడా చైనా తన అల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్‌కి మద్దతుగా నిలిచి, తన అక్కసును వెళ్లగక్కింది. ఇదిలా ఉంటే చైనా, భారత అవిభాజ్య అంతర్భాగమైన లడఖ్ ప్రాంతంపై అవాకులు చెవాకులు పేలింది.
Ladakh Earthquake: ఇటీవల కాలంలో ప్రపంచవ్యాస్తంగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని ఏదోక ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. శనివారం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌లో భూకంపం చోటుచేసుకోగా.. ఇదే రోజు లెహ్ లడఖ్‌లోనూ భూకంపం సంభవించడం గమనార్హం. ఇవాళ ఉదయం 8. 25 నిమిషాల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతో అక్కడ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 35.44 అక్షాంశం, 77.36 రేఖాంశంలో 10 కిలో మీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.…
Indian Air Force: చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లడఖ్‌లోని న్యోమాలో భారత్ ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించింది.
లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో వారి వాహనం రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకోనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్‌పై వెళ్లారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో తెలిపారు. భారత్ జోడో యాత్ర ఇంకా ముగియలేదన్నారు. లడ్డాఖ్ వరకు తాను యాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.
Rekha Singh: 2020 లడఖ్ గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. ప్రతిగా భారత్ బలగాలు జరిపిన దాడిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారు. అయితే తమ వారు మాత్రం నలుగురే చనిపోయారంటూ చైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. గాల్వాన్ ఘర్షణల్లో భారత సైనికుల వీరత్వాన్ని చూసిన చైనా బలగాలు మరోసారి భారత్ పై…
తూర్పు లడఖ్‌లో మూడేళ్లుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్, చైనాలు ఆదివారం (నేడు) తూర్పు లడఖ్ సెక్టార్‌లోని చుషుల్-మోల్డో సమావేశ స్థలంలో 18వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను నిర్వహిస్తున్నాయి. భారత్ వైపు నుంచి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.