Weather news: పలు రాష్ట్రాలకు వాన కబురు.. ఈ ప్రాంతాల్లో 4 రోజులు భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ వాన కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర భారత్‌కు చెందిన రాష్ట్రాల జాబితాను కేంద్ర వాతావరణ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 26 నుంచి 29 వరకు ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే అధికారులు కూడా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: TS LAWCET: లా సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?
Also Read
ఏప్రిల్ 26 నుంచి 29 వరకు జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో అయితే ఏప్రిల్ 29న భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. ఆ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షంతో పాటు వడగళ్లు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 28-29 తేదీల్లో వడగళ్ల వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఉద్యోగులు, ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: Pithapuram: బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. అంతగా సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక పిల్లలు, వృద్ధులైతే వేడిగాలులతో అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణం చల్లబడితే ప్రజలు వేడి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.
Isolated hailstorm over Jammu-Kashmir-Ladakh-Gilgit-Baltistan-Muzaffarabad on 26th and Himachal Pradesh during 26th-28thand Uttarakhand on 28th & 29th April, 2024.
— India Meteorological Department (@Indiametdept) April 26, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు