Sonam Wangchuk: లడఖ్ రాష్ట్రహోదా.. 21 రోజుల నిరాహారదీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk: లడఖ్ రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మంగళవారం లేహ్‌లో తన నిరాహార దీక్షను విమరించారు. మైనర్ బాలిక ఇచ్చిన నిమ్మరసాన్ని తాగి నిరాహార దీక్షను విరమించారు. ఈ కార్యక్రమానికి జనం భారీ సంఖ్యలో నిరసన వేదిక వద్ద హాజరయ్యారు. ‘‘నిరాహార దీక్ష మొదటి దశ ఈ రోజుతో ముగిసింది. అయితే ఇది ఆందోళన ముగింపు కాదు’’ అని ఆయన పేర్కొన్నారు. “లడఖ్ కోసం రాజ్యాంగపరమైన రక్షణలు మరియు ప్రజల రాజకీయ హక్కుల కోసం నేను పోరాడుతూనే ఉంటానని అన్నారు.
Read Also: Jaishankar: చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో.. ఫిలిప్పీన్స్‌కి భారత్ మద్దతు..
Also Read
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
విద్యా సంస్కరణవాది, పర్యావరణ కార్యకర్త అయిన వాంగ్ చుక్ మాట్లాడుతూ.. నిరాహార దీక్ష ముగింపు కొనసాగుతున్న ఆందోళన కొత్త దశకు నాంది అని అన్నారు. మా పోరాటాన్ని కొనసాగిస్తామని, 20 రోజులుగా వేదిక వద్ద 10,000 మంది ప్రజలు గుమిగూడటం, 60,000 మందికి పైగా పాల్గొనడం ప్రజల ఆకాంక్షలకు నిదర్శనమని ఆయన అన్నారు. లేహ్ మరియు కార్గిల్ జిల్లాలతో కూడిన లడఖ్, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019న రద్దు చేసిన తర్వాత ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది.
అంతకుముందు మంగళవారం రోజు ఎక్స్ వేదికగా వాంగ్‌చుక్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. హిమాలయాలను రక్షించాలని, స్థానిక తెగలను రక్షించడానికి లడఖ్‌లో ఆరో షెడ్యూల్ అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 350 మంది ఈ రోజు -10 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిద్రపోయారని, కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం నుంచి ఒక్క మాట రాలేదని, దేశంలో మనకు చిత్తశుద్ధి, దూరదృష్టి, జ్ఞానం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలని, చిన్న చూపు-క్యారెక్టర్ లేని రాజకీయ నాయకుడు వద్దని, త్వరలోనే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తాము రాజనీతిజ్ఞులని నిరూపిస్తారని నేను చాలా ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశప్రయోజనాలను దృష్ట్యా చాలా జాగ్రత్తగా అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!