లడఖ్ రాష్ట్ర సాధన కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైల్లో ఉంచారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ఇటీవల పెద్ద ఎత్తున లడఖ్‌లో హింస చెలరేగింది. బీజేపీ కార్యాలయం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలను అల్లరిమూకలు తగలబెట్టారు.
Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోరుతూ, లడఖ్ వ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు జరిగాయి. భద్రతా బలగాలు, బీజేపీని టార్గెట్ చేస్తు ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో నలుగురు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు.ఈ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా చేయబడ్డాయని లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ఆరోపిస్తూ, లేహ్ వ్యాప్తంగా ఖర్ఫ్యూ విధించారు. అల్లర్ల వెనక ఉన్న ప్రతీ వ్యక్తిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్‌లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
LAC: జాతీయ భద్రత, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంబడి కనెక్టివిటీ పెంచే దిశగా తూర్పు లడఖ్‌లోని ముధ్ న్యోమా వద్ద భారతదేశంలో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయనుంది. సముద్రమట్టానికి దాదాపు 13,700 అడుగుల ఎత్తులో ఉన్న న్యోమా భారత్-చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీకి దగ్గరగా ఉన్న అడ్వాన్సుడ్ ల్యాండింగ్ గ్రౌండ్(ALG).
Z-Morh Tunnel: జమ్మూ-కశ్మీర్ లోని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (జనవరి 13) ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్ ను నిర్మించారు.
లడఖ్‌లోని పాంగోంగ్ త్సో దగ్గర 30 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం మరాఠా యోధుడి యొక్క వారసత్వాన్ని గౌరవించేలా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
India-China Border: భారత్- చైనా దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.
Sonam Wangchuk: హోం మంత్రిత్వ శాఖ హామీ మేరకు సోనమ్ వాంగ్‌చుక్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. తాజాగా ఆయనని జమ్మూ కాశ్మీర్, లడఖ్ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ లోఖండేను కలుసుకున్నాడు. లడఖ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న మంత్రిత్వ శాఖ అత్యున్నత కమిటీ హోం మంత్రిత్వ శాఖ నుండి ఒక లేఖను అతనికి అందజేసింది. ఆయనతో తదుపరి సమావేశం డిసెంబర్ 3న జరగనుంది. దీని తరువాత వాంగ్‌చుక్, అతని మద్దతుదారులు తమ నిరాహార దీక్షను విరమించాలని…