Rekha Singh: 2020 లడఖ్ గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. ప్రతిగా భారత్ బలగాలు జరిపిన దాడిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారు. అయితే తమ వారు మాత్రం నలుగురే చనిపోయారంటూ చైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. గాల్వాన్ ఘర్షణల్లో భారత సైనికుల వీరత్వాన్ని చూసిన చైనా బలగాలు మరోసారి భారత్ పై…
భారత్, చైనా మధ్య సరిహద్దులో వివాదం కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు భారీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ( LAC) వరకు భారీ పరికరాలను రవాణా చేయగల రోడ్డు, రైలు మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
తూర్పు లడఖ్‌లో మూడేళ్లుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్, చైనాలు ఆదివారం (నేడు) తూర్పు లడఖ్ సెక్టార్‌లోని చుషుల్-మోల్డో సమావేశ స్థలంలో 18వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను నిర్వహిస్తున్నాయి. భారత్ వైపు నుంచి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
S Jaishankar: ఇండియా, చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు దగ్గరదగ్గరగా ఉన్నాయని, సైనికపరంగా ప్రమాదకరంగా ఉన్నాయని శనివారం ఆయన అన్నారు. ఇండియా టుడే ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Air Force's Massive Exercise Near LAC In Northeast: ఇండియా-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ నిన్న చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో మాట్లాడారు. లడఖ్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనికులతో యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దీంతో చైనా మరేదైనా కుట్ర చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
India - China Border Issue: డ్రాగన్ కంట్రీ ఇండియా సరిహద్దుల్లో కుట్రలు చేయడం మానడం లేదు. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెడుతామని చూస్తోంది. గతంలో గాల్వాన్ ప్రాంతంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో చైనా దురాక్రమణను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భారత సరిహద్దులో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పోరాట సన్నద్ధతను పరిశీలించారు.
India Ready For Any Situation On China Border, Says Army Chief: చైనా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) ఆకస్మిక పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లోని సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటకలో జరిగిన ఆర్మీడే కార్యక్రమంలో వెల్లడించారు. సైన్యం గతేడాది కాలంలో దేశభద్రతకు సంబంధించి…
Army Chief General Manoj Pande: లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి చైనా బలగాల్లో స్వల్ప పెరుగుదల ఉన్నట్లు భారీ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా దళాల సంఖ్య స్వల్పంగా పెరిగిందని.. వారి కదలికను నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. చైనా బలగాల కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. చైనాతో ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. చైనాను…
China has deployed drones and warplanes along the border: జిత్తులమారి చైనా భారత సరిహద్దు వెంబడి యుద్ధ విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది. సరిహద్దు వెంబడి పలు ఎయిర్ బేస్ లను నిర్మించిన చైనా దాని వెంబడి సైనిక మోహరింపును పెంచుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఘర్షణల తర్వాత డ్రాగన్ కంట్రీ తన కుతంత్రాలకు పదును పెడుతోంది. హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు చైనా మోహరింపును స్పష్టంగా చూపిస్తున్నాయి. భారత ఈశాన్య ప్రాంతానిక అతి దగ్గరలో…
భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. అరుణాచల్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపంలో రెండు దేశాలకు చెందిన దళాలు ఘర్షణ పడ్డాయి, ఇరుపక్షాలు విడిపోయాయి ముఖాముఖి తలపడ్డారు.. ఈ ఘర్షణలో రెండు వైపుల నుండి కొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.. డిసెంబరు 9న జరిగిన ఈ ఘర్షణలో డ్రాగన్ కంట్రీతో పాటు భారత సైనికులు కూడా కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి.. ఆ తర్వాత ఇరు పక్షాలు వెంటనే విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది..…