S Jaishankar: ఇండియా, చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు దగ్గరదగ్గరగా ఉన్నాయని, సైనికపరంగా ప్రమాదకరంగా ఉన్నాయని శనివారం ఆయన అన్నారు. ఇండియా టుడే ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2020లో గాల్వాన్ ఘర్షణ సమయంలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా వైపు 40 మందికి పైగా సైనికులు మరణించారు. అయితే చైనా ఇప్పటి వరకు సరైన మరణాల వివరాలను చెప్పలేదు. ఈ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చల ద్వారా పరిస్థితి శాంతించింది. గతేడాది డిసెంబర్ నెలలో అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో మరోసారి ఇదే దేశాల బలగాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో ఇరువైపుల సైనికలు గాయపడ్డారు. భారత ఆర్మీ, చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టింది.
Read Also: Viral : ఆదర్శ దంపతులు.. భర్త రేప్ చేస్తుంటే భార్య వీడియో తీసింది
చైనా, భారత్ సరిహద్దు లైన్ ఆఫ్ ఆక్చుయల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత అలాగే ఉంది. మరోవైపు చైనా టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మౌళిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోంది. దీనికి ధీటుగా భారత్ కూడా అంతే స్థాయిలో బోర్డర్ వెంబడి మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. చైనా ముందస్తు వ్యూహంలో భాగంగానే తమ ఆర్మీని, యుద్ధ సామాగ్రిని త్వరగా తరలించే విధంగా రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడం భారత్ కు ప్రమాదకరంగా మారింది. ఇందులో ఓ రైలు మార్గం చైనా ఆక్రమిత ఆక్సాయ్ చిన్ నుంచి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సరిహద్దుల్లోని ఎయిర్ బేసుల్లో విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది.