LAC: జాతీయ భద్రత, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంబడి కనెక్టివిటీ పెంచే దిశగా తూర్పు లడఖ్‌లోని ముధ్ న్యోమా వద్ద భారతదేశంలో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయనుంది. సముద్రమట్టానికి దాదాపు 13,700 అడుగుల ఎత్తులో ఉన్న న్యోమా భారత్-చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీకి దగ్గరగా ఉన్న అడ్వాన్సుడ్ ల్యాండింగ్ గ్రౌండ్(ALG).
S Jaishankar: భారత్-చైనా సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్‌లో మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 2020 నుంచి అసాధారణంగా ఉన్న సంబంధాలు నెమ్మదిగా మెరుగవుతున్నాయని ఆయన చెప్పారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో రెండు మిలిటరీలు ఘర్షణ పడ్డాయి, 45 ఏళ్లలో మొదటిసారి ఇరువైపుల మరణాలకు దారి తీసింది. ప్రస్తుతం పరిస్థితులు మెరగయ్యాయని జైశంకర్ అన్నారు. నితంతర దౌత్య చర్చలు రెండు దేశాల సంబంధాలను కొంత మెరుగుపరిచే దిశలో ఉంచాయని వివరించారు.
India-China Border: భారత్- చైనా దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.
S Jaishankar: కజకిస్తాన్ వేదికగా ఆస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమ్మిట్‌కి భారతదేశం తరుపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యితో భేటీ అయ్యారు.
China: జిత్తులమారి డ్రాగన్ కంట్రీ చైనా భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భారత సరిహద్దులను అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే, ప్రస్తుతం భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత్‌లోఅంతర్భాభాగ మేనని అగ్రరాజ్య అమెరికా మరో సారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని తెలిపింది.
Pentagon Report: భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి 2022లో సైనికి ఉనికిని, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పెంచింది. ఈ విషయాలను అమెరికా పెంటగాన్ నివేదిక వెల్లడించింది. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ నివేదిక 2023 ప్రకారం.. భూగర్భ నిల్వ సౌకర్యాలు, కొత్త రోడ్లు, డ్యూయల్ పర్పస్ ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణాలు ఎల్ఏసీ వెంబడి పెరిగాయి.
Assam: చారిత్రాత్మక బ్రహ్మపుత్ర నది కింద భారత సైన్యం సొరంగం నిర్మిస్తుందని గతంలోనే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. ప్రతిపాదిత సొరంగం బ్రహ్మపుత్ర నది కింద మిసా నుంచి ప్రారంభమై తేజ్‌పూర్ వరకు కొనసాగుతుంది.
Galwan Valley Clash: అది 15 జూన్ 2020.. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌లో భారతదేశం, చైనాల మధ్య హింసాత్మక ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఈ ఘటన జరిగి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి.
S Jaishankar: భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని చైనా రక్షణ మంత్రి ఒకరోజు ముందు కీలక కామెంట్స్ చేశారు. దీని తర్వాతి రోజే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా తీరుపై ధ్వజమెత్తారు. సరిహద్దు ఒప్పందాలు ఉల్లంఘించిన కారణంగా చైనాతో భారత్ సంబంధాలు సరిగా లేవని ఆయన అన్నారు. పాకిస్తాన్, చైనా మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటోందని అన్నారు. కరేబియన్ దేశం డొమినికన్…