Ukraine: అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయిన వాతావరణం కనిపిస్తోంది. గత వారం వైట్‌హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చల్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు నేతలు నువ్వా నేనా అన్న రీతిలో మీడియా ముందు లైవ్‌లోనే మాటలనుకున్నారు. దీంతో ప్రతిపాదిత ‘ఖనిజ ఒప్పందం’పై జెలెన్ స్కీ సంతకం చేయకుండానే వైట్ హౌజ్ నుంచి వెనుదిరిగారు.
Vladimir Putin: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు.
Russia Ukraine War: రష్యా దూకుడుగా దాడి చేస్తుండటంతో ఉక్రెయిన్ సైనికులు డీలా పడ్డారు. దీంతో రేపోమాపో కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు మొదలైతే ఉక్రెయిన్ రష్యాతో గట్టిగా బేరమాడలేని స్థితిలోకి జారిపోతుంది.
Russia-Ukraine War: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన యుద్ధం రష్యా-ఉక్రెయిన్ వార్. 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా నిలిచిన ఈ యుద్ధం నేటి ( మంగళవారం)తో 1000వ రోజుకు చేరుకుంది.
Russia- Ukraine Conflict: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి చేసినట్లు పేర్కొనింది. ఈ వైమానిక దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రష్యా పైకి క్షిపణులు ప్రయోగించడానికి తమ మిత్ర దేశాలు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. రష్యాకు మద్దతుగా మోహరించిన నార్త్ కొరియా సేనలను ధీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులే ప్రయోగించాలన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌లోని కైవ్ మరియు ఇతర నగరాలపై రష్యా 136 డ్రోన్లు ప్రయోగించింది. ఇందులో 51 డ్రోన్లను ఉక్రెయిన్ వాయు రక్షణ దళం కూల్చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడుతోంది. కీవ్‌తో పాటు పశ్చిమ భాగాన ఉన్న మరో నగరం ఎల్వీవ్‌పై ఆదివారం తెల్లవారుజామున రష్యా భారీ వైమానిక దాడికి దిగింది. రష్యా క్షిపణుల్లో ఒకటి తమ గగనతలాన్ని ఉల్లంఘించినట్లు పోలాండ్ ఆరోపించింది. బఖ్‌ముత్‌కి సమీపంలో ఉన్న గ్రామాన్ని ఆక్రమించుకున్నామని రష్యా సైన్యం చెప్పిర ఒక రోజు తర్వాత ఆదివారం దాడులని మరింత తీవ్రం చేసింది.
ఉక్రెయిన్ నగరాలను స్వాధీనం చేసుకోడానికి రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. అయితే.. రష్యా దళాలు కీవ్ నగరంపై అర్థరాత్రిపూట డ్రోన్ లతో దాడులు చేశాయని అధికారులు తెలిపారు, ఉక్రెయిన్ రాజధానికి వ్యతిరేకంగా నెల రోజుల పాటు వైమానిక దాడులను కొనసాగించారు.
Russia - Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి చేసింది. ఏకంగా 120 క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా రష్యా వైమానిక దాడుల హెచ్చరికను జారీ చేసింది.