Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ సర్వనాశనం అవుతున్నాయి. దీంతో పాటు మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలు రష్యా క్షిపణి దాడుల్లో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం రష్యా 70కి పైగా మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ పేలుళ్లతో దద్దరిల్లింది. కామికేజ్ డ్రోన్లతో రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. డ్రోన్లు నగరంపై దాడి చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు వెల్లడించారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల మధ్య రాజధాని కీవ్ లో మూతపడిన భారత రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం కానుంది. రష్యా దాడి తీవ్రమవుతున్న సమయంలో భారత రాయబార కార్యాలయాన్ని మార్చి 13 పోలాండ్ లోని వార్సాకు తరలించారు. తాజాగా మే 17 నుంచి కీవ్ లో ఎంబసీని తెరవనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి పనిచేసేందుకు వివిధ పాశ్చాత్య దేశాలు సమాయత్తం అవుతున్న వేళ భారత్ కూడా తన ఎంబసీని ఉక్రెయిన్…
ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ మరోసారి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పట్టుకోసం ప్రయత్నిస్తున్న రష్యా బలగాలు.. తీవ్రదాడులకు పాల్పడుతున్నాయి.. అదే స్థాయిలో ఉక్రెయిన్ సేనల నుంచి ప్రతిఘటన కూడా తప్పడంలేదు.. ఇక, ఇప్పటికే నలుగురు రష్యా మేజర్ జనరల్స్ తమ చేతితో హతమయ్యారని, 14 వేల మంది సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ చెబుతోంది.. ఇదే సమయంలో.. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా సాగుతోంది.. ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోంది.. పోలాండ్ సరిహద్దు సమీపంలోని యవరీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. మిలటరీ ట్రైనింగ్ క్యాంపుపై మిస్సైల్‌లో దాడులకు పూనుకుంది.. రష్యా దాడుల్లో తాజాగా 35 మంది మృతిచెందగా.. 134 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఇక, మరో మేయర్‌ను కూడా కిడ్నాప్ చేసింది రష్యా సైన్యం, తాజాగా మెలిటోపోల్ మేయర్‌ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.. దీంతో ఇప్పటి వరకు కిడ్నాప్‌నకు గురైన…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారత పౌరులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు సాగుతుండగా.. మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. భారత వైమానిక దళాన్ని తరలింపు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను మరింత వేగంగా తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానం ద్వారా భారతీయులను తీసుకొచ్చేందుకు ఆలోచన…
ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు విఫలం అయిన తర్వాత యుద్ధం మరింత భీకరంగా సాగుతోంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీపై ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది.. దీంతో ఉక్రెయిన్‌లోని తమ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ముఖ్యంగా కీవ్ సిటీని వెంటనే ఖాళీ చేయాలని.. కీవ్‌ను భారతీయులు తక్షణమే వదిలి పెట్టాలని కేంద్రం ఆదేశించింది.. కీవ్ సిటీ నుంచి ఎలాగైనా బయటపడండి అని ఆదేశాలు జారీ చేసింది. Read Also: Zain Nadella:…
ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. బాంబుల మోత.. సైరన్ హెచ్చరిక.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. రాత్రి, పగలు తేడా లేదు, నిద్రాహారాలు లేవు. గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌లో ఇదే పరిస్థితి. ఎక్కడ బాంబు పడుతుందో… ఏవైపు నుంచి మిసైల్స్ దూసుకొస్తాయో.. తెలియదు. రష్యా దాడులకు ధీటుగా ఎదుర్కొంటోంది ఉక్రెయిన్ సైనం. ప్రజలు సైతం… ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడి కక్కడ రష్యా సైనికులను అడ్డుకుంటున్నారు. రష్యా దాడికి నిరసనగా రోడ్లపై నిరసన…
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా… రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. కీవ్‌ను చుట్టుముట్టాయి రష్యా బలగాలు, కీవ్‌కు వెళ్లే రోడ్లు అన్నింటినీ దిగ్బంధించాయి రష్యా సేనలు… ఉక్రెయిన్‌పై మెరుపు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు, ఉక్రెయిన్ సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతోంది.. ఇప్పటి వరకు 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించగా.. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది ఉక్రెయిన్పౌరులు మృతిచెందినట్టుగా చెబుతున్నారు..…