Zelensky: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతుంది. కీవ్‌ను నేలమట్టం చేయడమే లక్ష్యంగా గత నెలలో 20సార్లు రష్యా డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా వేల సంఖ్యలో సైనికులను ఆ దేశానికి పంపిందని కీవ్ ఆరోపిస్తుంది. ఈ విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రష్యా పైకి క్షిపణులు ప్రయోగించడానికి తమ మిత్ర దేశాలు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. రష్యాకు మద్దతుగా మోహరించిన నార్త్ కొరియా సేనలను ధీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులే ప్రయోగించాలన్నారు.
Read Also: IND vs UAE: ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా
ఇక, రష్యా తన భూభాగంలో రెడీగా ఉంచిన నార్త్ కొరియా సైనికుల స్థావరాలపై నిఘా పెడతామని జెలెన్‌స్కీ తెలిపారు. అలాగే, రష్యా కర్మాగారాల్లో కిమ్ దేశానికి చెందిన ఆయుధాలు, సైనికులు మాత్రమే కాకుండా.. తమ ఆక్రమిత ప్రాంతాలైన కుర్స్క్‌లోనూ వారి సైనికులే ఉన్నారు.. త్వరలోనే వారు ఉక్రెయిన్‌పై దండెత్తడానికి రెడీ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే, మిత్రదేశాలు తమకు ఆయుధ సహాయం చేయకుండా నార్త్ కొరియా సైన్యం మాపై దాడి చేసేంత వరకు వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తున్నారని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Karthika Mahotsavam 2024: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. పెరిగిన రద్దీ
కాగా, అక్టోబర్ నెలలో రష్యా 2,023 డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 1,185 డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్నాం.. మరో 738 డ్రోన్ల వల్ల నష్టం వాటిల్లిందన్నారు. అలాగే, ఈ ఏడాది ప్రారంభం నుంచి తమపై రష్యా 6,987 డ్రోన్లతో దాడి చేసింది.. జనావాసాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ముందకు వెళ్తుందన్నారు. అయితే, ఉక్రెయిన్ ఆరోపణలను తీవ్రంగా రష్యా ఖండించింది. జనావాసాలను తాము టార్గెట్ చేయలేదని స్పష్టం చేసింది. తమ దేశానికి ముప్పు పొంచి ఉండటంతోనే ఉక్రెయిన్ మిలిటరీ మౌలిక సదుపాయాలను, ఇంధన వ్యవస్థను దెబ్బతీసేందుకే దాడులు చేస్తున్నామని రష్యా సైన్యం వెల్లడించింది.