Ukraine: అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయిన వాతావరణం కనిపిస్తోంది. గత వారం వైట్‌హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చల్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు నేతలు నువ్వా నేనా అన్న రీతిలో మీడియా ముందు లైవ్‌లోనే మాటలనుకున్నారు. దీంతో ప్రతిపాదిత ‘ఖనిజ ఒప్పందం’పై జెలెన్ స్కీ సంతకం చేయకుండానే వైట్ హౌజ్ నుంచి వెనుదిరిగారు.
Read Also: Tahawwur Rana: ‘‘భారత్‌కి అప్పగిస్తే నాకు చిత్రహింసలు’’.. ముంబై ఉగ్రదాడి నిందితుడి అప్పగింత ఆలస్యం..
ఇదిలా ఉంటే, ట్రంప్ జెలెన్ స్కీకి తన దెబ్బ చూపిస్తున్నాడు. ఉక్రెయిన్ యుద్ధంలో ఇన్నాళ్లు జెలెన్ స్కీకి అన్ని వేళల సహకారం అందించిన అమెరికా, ఇప్పుడు ట్రంప్ రావడంతో తీరు మార్చుకుంది. ఉక్రెయిన్‌కి అందించే ఆర్థిక సహాయాన్ని ట్రంప్ కట్ చేశాడు. తాజాగా, అమెరికా రష్యాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వివరాలను పంచుకోవడం నిలిపేసినట్లు తెలుస్తోంది. దీంతో, రష్యాతో శాంతి చర్చలకు జెలెన్ స్కీ అమెరికాకు సహకరించాలనే ఒత్తిడి మరింత పెరిగింది. లాంగ్ రేంజ్ డ్రోన్ దాడులను నిర్వహించగలిగే ఉక్రెయిన్ సామర్థ్యం దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రష్యాలోని టార్గెట్లకు సంబంధించిన వివరాలను ఇకపై అమెరికా ఉక్రెయిన్‌కి ఇవ్వడం నిలిపేస్తుంది. దీంతో ఉక్రెయిన్ పోరాట సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి అమెరికా, నాటో కూటమి ఉక్రెయిన్‌కి ఆర్థిక, ఆయుధ, నిఘా సేవల్ని అందిస్తోంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఆర్థిక, నిఘా ఉక్రెయిన్‌కి అందకుండా పోతుంది.