KVP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రాణమిత్రుడు కేవీపీ రామచంద్రరావు ‘పోలవరం-ఓ సాహసి ప్రయాణం’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సదరు పుస్తకంలో కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకుల గురించి అందులో కూలంకుషంగా చర్చించారు. డెల్టా ప్రాంతాలకు, రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులకు నీటిలభ్యత లేకపోవడమే కారణమని ఆనాడు వైఎస్ఆర్ ఆలోచించారని.. అందుకే ఏపీలో సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం…
KVP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. కర్ణాటక సరిహద్దు మోక వద్ద ఏపీలో ప్రారంభం కానుంది. ఏపీలో నాలుగు రోజుల పాటు 90 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్ జోడో యాత్ర నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్…
సంకలో పిల్లాడ్ని పెట్టుకుని సంతంత వెతికరాట ఈసామెత విన్నారా.. ఓ నెక్లెస్ వ్యవహారంలో కూడా అచ్చం ఇలానే జరిగింది. నిన్న డైమెండ్ నెక్లెస్ పోయిందంటూ ఓ మాజీ రాజ్యసభ సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఇంట్లోనే ఆ డైమండ్ నెక్లెస్ దొరకడంతో.. పోలీసులకు మాజీ రాజ్యసభ సభ్యుడు ఫోన్ చేసి చెప్పాడు. ఇక పోలీసులకు వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్లు హమ్మయ్య అంటూ ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు.…
ఏపీ కాంగ్రెస్ కి జవసత్వాలు ఇచ్చి ముందుకు నడిపించే సారథి కోసం హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఏపీసీసీ చీఫ్ మార్పుపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పుపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ. ఏపీసీసీ చీఫ్ పదవికి రేసులో ఐదుగురు నేతలు వున్నారని తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ హర్షకుమార్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సుంకర…
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు విజయమ్మ. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌తో పని చేసిన వారికి, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు.. ఇక, వైఎస్‌ఆర్ సన్నిహితుడి, ఆత్మగా పేరున్న మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు కూడా ఆహ్వానం వెళ్లింది.. గాంధీ భవన్‌లో వైఎస్‌ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మీయ సమ్మేళనానికి నాకు ఆహ్వానం అందింది.. నేను…