KVP Ramachandra Rao: జగన్‌కు ఎందుకు దూరంగా ఉన్నానంటే..? సమాధానం చెప్పాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KVP Ramachandra Rao: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావును వైఎస్ ఆత్మగా పిలిచేవారు.. అయితే, వైఎస్సార్ కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌తో కేవీపీకి సంబంధాలు లేవు.. ఇవాళ విజయవాడలో మీట్‌ది ప్రెస్‌లో ఇదే ప్రశ్న కేవీపీకి ఎదురైంది.. దీనిపై స్పందిస్తూ.. వైఎస్సార్‌కు దగ్గరగా ఉన్న నేను జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పబోనన్నారు.. కానీ, ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేను.. ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందే.. మరో రోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు కేవీపీ.. దీంతో, ఆయన ప్రత్యేకంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ సంబంధాలపై ఏర్పాటు చేసే ఆ ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతున్నారు అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Read Also: Mahesh Babu: #SSMB28 షూటింగ్ బ్రేక్… సంక్రాంతి వరకూ టైం ఉంది కదా…
Also Read
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
మరోవైపు.. బీజేపీ-వైసీపీ సంబంధాలపై సీరియస్‌గానే స్పందించారు కేవీపీ.. బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించ లేకపోతుందో నాకు కారణం తెలియదన్న ఆయన.. ప్రత్యేక పరిస్థితులని చెప్పిన నేనే.. ఆ ప్రత్యేక పరిస్థితులేంటో తెలియదని చెబుతున్నాను అన్నారు.. ఇక, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు కేవీపీ.. 2018లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని నేను వ్యతిరేకించా.. ఈ విషయం ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు. టీడీపీతో పొత్తు నచ్చకున్నా.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నోరు మెదపలేదన్నారు. ఆనాడు నేనెక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీ చాలంటూ చంద్రబాబు ఏపీకి మరణ శాసనం రాశారని.. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి దీక్ష చేయడం చంద్రబాబు వల్లే సాధ్యమైంది అంటూ మండిపడ్డారు. 2016లో రాహుల్ గాంధీ మీద రాళ్లేయించిన చంద్రబాబు.. 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని.. ఎన్టీఆర్ కోసం 1984లో పోరాటం చేసి.. అదే ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి బయటకి పంపిన ఘనుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: YS Sharmila: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్.. ఏం మాట్లాడారంటే?
వైఎస్ తవ్వించిన కాల్వల నుంచి నీరు పారించి.. మొత్తం నేనే చేశానని చెప్పుకునే ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు కేవీపీ.. సెల్ ఫోన్లు తెచ్చిన సమర్ధుడు చంద్రబాబు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే చంద్రబాబు.. రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇక్కడ కూర్చొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దేనికి.. ఢిల్లీకి వచ్చి పోరాడాలని సూచించారు. చంద్రబాబుకు జేడీఎస్ తో ఇప్పటికే మంచి పరిచయాలు ఉన్నాయని గుర్తుచేశారు.. ఏపీలో మురికి కాల్వల్లో అవినీతి గురించి మాట్లడడానికే చంద్రబాబు పరిమితం కాకూడదు అంతూ హితవు పలికారు కేవీపీ రామచంద్రరావు.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!