కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి.
ప్రేమికులను విడదీసిన పెద్దలను చూసుంటాం, ప్రేమ కథలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలనూ విని ఉంటాం.. కానీ, ప్రేమను గెలిపించే పోరాటం పిడకల సమరం మాత్రం మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.. దానికి మన ఆంధ్రప్రదేశ్ వందల ఏళ్ల క్రితమే వేదికగా మారింది.. చరిత్రలో నిలిచిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది మరుసటి రోజు…
పరిమితికి మించి ప్రయాణం.. మితిమీరిన వేగం.. ప్రమాదానికి కారణమైంది. పొలానికి వెళ్లి తిరిగివస్తున్న కూలీలను గాయాల పాలు చేసింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో టైరు పగిలి కూలీలు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది.
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న 'మేమంతా సిద్ధం' సభకు.. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది.
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంనకు చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తుండగా... శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మంత్రాలయం ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వాల్మీకి మహర్షి శ్రీరాముని చరిత్ర రాసి ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు అని తెలిపారు. శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది.. శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి చరిత్రలో నిలిచాడు అని ఆయన పేర్కొన్నారు.