Andhra Pradesh: కొందరు పెళ్లికు ముందు ఎన్నో వ్యవహారాలు నడిపి.. బుద్ధిగా పెద్దలు చూసిన సంబంధంతో పెళ్లి చేసుకుంటారు.. మరికొందరు ప్రేమతో ఒక్కటవుతారు.. అయితే.. పెళ్లిచేసుకుంటానని నమ్మించి మేసం చేసి.. మరొకరితో పెళ్లికి సిద్ధమై దొరికిపోయిన వారు కూడా ఉన్నారు.. తాజాగా, ఏపీలో మరో అరగంటలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది.. బ్రహ్మగుండం క్షేత్రంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది.. కానీ, తాళి కట్టే సమయంలో ఫొటోలు పంపి.. వరుడి భాగోతం బట్టబయలు చేసింది విశాఖపట్నంకు చెందిన యువతి.. దీంతో షాక్ తిన్న పెళ్లికూతరు కుటుంబ సభ్యులు.. పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు.
Read Also: IPL 2024: ఐపీల్ వేళ 10 జట్ల కెప్టెన్ల సక్సెస్ రేటు ఎంతో తెలుసా..?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెల్దుర్తి మండల పరిధిలోని రామళ్లకోటకు చెందిన యువకునికి.. కర్నూలుకి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. కట్నాలు, కానుకలు అన్నీ కుదరడంతో.. రామళ్లకోట టు వెల్దుర్తి రోడ్డులోని బ్రహ్మగుండం క్షేత్రంలో 20వ తేదీన ఉదయం 9గంటలకు పెళ్లికి ముహూర్తం పెట్టారు.. ఇక, బుధవారం ఉదయం పెళ్లి తతంగం ప్రారంభమైంది.. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, పెద్దలు, కుటుంబ సభ్యులు ఇలా అంతా పెళ్లి మండపడానికి చేరుకుంటున్నారు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరికొందరు ముందుగానే కలిసి వెళ్లిపోయారు.. ఇక, పెళ్లి పీటల మీదకు చేరుకున్నారు.. వధువు, వరుడు.. ఇదే సమయంలో.. ఓ పిడుగులాంటి వార్త.. చేరింది.. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పెళ్లి కుమారుడు తనతో సహజీవనం చేస్తున్నాడంటూ.. వైజాగ్ నుంచి కాల్ చేసింది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ వివాహిత.. తనను పెళ్లి చేసుకున్నాడని.. పిల్లాడు కూడా ఉన్నాడంటూ ఫొటోలు పంపించింది.. ఇక, పెళ్లి కుమారుడి బాగోతం బట్టబయలు కావడంతో.. పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లిని ఆపేశారు.
Read Also: BRS Ex MLA Son: జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్
ఇక, పెళ్లికుమారుడు మహేంద్రనాయుడు, అతడి కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. విశాఖ పోర్టులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మహేంద్రనాయుడు.. మరో మహిళతో సహజీవనం చేస్తూ వచ్చాడట.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలుకుతూ.. తన శారీరక వాంఛలు తీర్చుకున్న అతగాడు.. గుట్టుచప్పుడు కాకుండా మరో పెళ్లికి సిద్ధం కాగా.. ఆ విషయాన్ని తెలుసుకున్న వివాహిత.. ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు టచ్‌లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే.. పెళ్లి ఆగిపోవడంతో పెద్ద గొడవే జరిగింది.. గ్రామ పెద్దలు, బంధువులు కలుగజేసుకుని.. పంచాయతీ నిర్వహించి.. వారు ఇచ్చిన కట్నకానుకలతో పాటు కొంత జరిమానా కట్టించేలా ఒప్పించి.. క్షమాపణలు చెప్పి పంపించినట్టుగా తెలుస్తోంది..