కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం హులేబీడు సమీపంలో జైలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఈ రోజు కర్నూలు జిల్లా ఓర్వకల్ లో చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. వాతావరణంలో మార్పులు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆ టూర్‌ను క్యాన్సిల్ చేశారు..
కర్నూలు జిల్లాలో ఉన్న హంద్రీ నదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. గోనెగండ్ల మండలం గంజహల్లి, దేవనకొండ మండలం తెర్నెకల్ మధ్య ఉన్న హంద్రీ నదిలో 25 మంది చిక్కుకున్నారు. చిక్కుకున్న వారు గంజిహల్లికి చెందిన వారిగా తెలిసింది.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత. కర్నూలులో టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు.
కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. శ్రీనివాసులు వయస్సు 48 ఏళ్లు.. అయితే, తెల్లవారుజామున బహిర్భూమికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు శ్రీనివాసులు.. ఈ సమయంలో ఆయన కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని దండగులు హత్య చేశారు.
Kurnool: కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. వాసంతి అనే బాలిక 7వ తేదీ నుంచి అదృశ్యం అయింది. అన్ని ప్రాంతాల్లో వెతికినా దొరకని బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో ఈశ్వర్ అనే బీటెక్ విద్యార్థి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్లో గేమ్స్ ఆడవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈశ్వర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
Kurnool District: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరు ఉహించనటువంటి ఫలితాలు చూసారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని అందుకున్నారు. కానీ కర్నూల్ జిల్లాల కుటుంభ రాజకీయాలను పలు మలుపులు తిప్పాయి. గత కొన్ని సంవత్సరములుగ ఉమ్మడి కర్నూల్ జిల్లాల్లో కుటుంభ రాజకీయాలు నడుస్తున్నాయి. కొన్ని కుటుంబాలు రాజకీయంగా బలపడితే మరికొన్ని కోలుకోలేని దెబ్బ తిన్నాయి. 2019 ఎన్నికల్లో 4 ప్రధాన కుటుంబాలకు రాజకీయంగా కోలుకోలేని విధంగా కనుమరుగు అయ్యారు. మల్లి…