కర్నూలు జిల్లా ఆలూరు మండలం వుళేబీడు గ్రామ సమీపంలో వేరు శనగ పంట పొలాలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ఆలూరులో మంత్రి జయరాం ఉండి కూడా పంట పొలాలను పరిశీలించకపోవడం చాలా బాధాకరం అని ఆయన వ్యాఖ్యనించారు.
కర్నూలు జిల్లాలో ఎల్లుండి ( ఈనెల 19వ తేదీన ) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు పథకం నాలుగవ విడతకు సంబంధించి నగదు జమ చేయనున కార్యక్రమానికి వెళ్తున్నారు.
గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేలకు దిగొచ్చాయి.
Earthquake in Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూ కంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి.. టర్కీలో భూకంపం తర్వాత భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో భూప్రకంపనల కలకలం రేపుతున్నాయి.. తుగ్గలి మండలం రాతనలో భూప్రకంపనలు వచ్చాయంటున్నారు స్థానికులు.. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఉలిక్కిపడిన ప్రజలు…
RTC Bus Accident: శ్రీశైలం డ్యాం వద్ద ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను బలంగా ఢీకొంది.
Road Accident: అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన కందుల జాహ్నవి అని పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన పోలీస్ కారు ఢీ కొట్టడంతో జాహ్నవికి తొలుత తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలింది. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు.. పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఇప్పటికే చాలా పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి.. మరికొన్ని స్కూళ్లలో పనులు జరుగుతున్నాయి.. కానీ, కర్నూలు జిల్లాలో పాఠశాల కంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గోడ కూలి టీచర్, విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే, టీచర్ అప్రమత్తతతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని కౌతాళం మండలం హాల్వీ ఎలిమేంటరీ స్కూల్‌లో ఈ ఘటన…
ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రోడ్ షోలు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన నన్నూరు మీదుగా కర్నూలు బైపాస్, బళ్లారి చౌరస్తా, పెద్దపాడు, కోడుమూరు, కరివేముల, దేవనకొండ, దూదేకొండ మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకు పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు పత్తికొండలో బహిరంగ సభలో…
Tamota Prices: టమోటా ధర మరోసారి రైతులను కన్నీరు పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో కేవలం రూపాయే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం పొలం నుంచి మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 కిలోలు చొప్పున ఉండే 15 గంపల టమోటాలకు పత్తికొండ మార్కెట్‌కు తెచ్చి విక్రయిస్తే కమీషన్ పోగా రైతులకు మిగిలింది కిలోకు కేవలం రూపాయి మాత్రమేనని వాపోతున్నారు.…