ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది… అనంతపురంలో జరిగిన ఓ పెళ్లికి హాజరై ఆమె.. ఆ తర్వాత కర్నూలులో వైఎస్సార్ మిత్రుణ్ణి పరామర్శించేందుకు వెళ్లారు.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిన తర్వాత గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.. రెండు టైర్లు పేలి.. కారు అదుపుతప్పినా.. డ్రైవర్ చాకచక్యంతో ఈ ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది.. ఆ తర్వాత మరో…
Farmer Got Diamond: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతును అదృష్ట దేవత వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం లభించింది. జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు తనకు ఉన్న పొలంలో టమోటా పంటను పండించాడు. ఈ సందర్భంగా చేనులో కలుపు తీసే పనులు చేస్తుండగా కళ్లు మెరిసిపోయేలా ఓ రాయి కనిపించింది. ఆ రాయిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా వజ్రం అని స్పష్టమైంది. సదరు వజ్రం 10 క్యారెట్లు ఉన్నట్లు రైతు నిర్ధారణ చేసుకున్నాడు.…
కర్నూలు జిల్లా వైసీపీలో వర్గపోరు బహిర్గతమైంది. దీంతో కర్నూలు మండలం గార్గేపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సుధాకర్, ఇంఛార్జ్ కోట్ల హర్ష వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గార్గేపురంలో కొంత కాలంగా ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఫంక్షన్ విషయంలో వైసీపీ ఎస్సీ వర్గం ప్రశాంత్ కుటుంబంపై వినయ్‌రెడ్డి వర్గం చేయిచేసుకుంది. దీంతో వినయ్ రెడ్డి ఇంటిపై ఎస్సీలు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు,…
కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం చోటు చేసుకుంది. నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కోసిగి మూడోవార్డులో నాలుగు రోజుల క్రితం బూగేని మాదేవి అనే మహిళ తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది. వాళ్లతో పాటు ఆడుకుంటున్న మరో బాలుడు శ్రీరాములు కూడా ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. కొన్ని పండ్లను చిన్నారుల తల్లి…
ఇటీవల కాలంలో వరుసగా యువతీయువకుల ప్రేమ పలు వివాదాస్పద ఘటనలకు కారణమవుతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి వెలుగు చూసింది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఓ ప్రేమజంట ప్రేమించుకున్నారనే కారణంగా వారి కుటుంబాల మధ్య వైరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రీజ, శివాజీ అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబసభ్యులు ఆమెకు మూడురోజుల క్రితం రచ్చమర్రికి చెందిన భీమతో…
ఏపీ సీఎం జగన్ వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు చేకూరే లబ్ధిని వివరిస్తూ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పలుచోట్ల బహిరంగ సభల్లో చంద్రబాబు హయాంలో ప్రజలకు జరిగిన లబ్ధి ఏమీ లేదని.. ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తోందని మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ మీదా జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం…